Lockdown: కలిసుందాం...రా, లేట్ ఎందుకు పదా, వచ్చేయ్, లవర్స్ ఎస్కేప్, పోలీస్ బాస్ ఎంట్రీ, ఫ్యామిలీ !

చెన్నై/ తిరుచ్చి: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలు కావడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఈ సందర్బంలో కొంత కాలం నుంచి కలుసుకోవడాకి అవకాశం లేకపోవడంతో ప్రేమికులు తట్టుకోలేకపోయారు. కులాలు వేరు కావడంతో అప్పటికే పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎలాగైనా ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ప్రేమికులు కలిసుందాం రా అంటూ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడారు. ప్రేమికులకు అండగా పోలీసులు నిలబడటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

 కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని తిరుచ్చి చింతామణి గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న రవి కుమారుడు వినోద్ (24) ఐటీఐ పూర్తి చేశాడు. తిరుచ్చి మదురై రోడ్డులోని జీవానగర్ లో జీవిత (20) అనే యువతి నివాసం ఉంటున్నది. తిరుచ్చిలోని బస్ స్టాండ్ సమీపంలోని ప్రైవేట్ కాలేజ్ లో జీవిత బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నది.

ఫ్రెండ్ ఇంటి సమీపంలో !

ఫ్రెండ్ ఇంటి సమీపంలో !

జీవానగర్ లోని జీవిత ఇంటి సమీపంలోని పూజారి వీదిలో ఆమె స్నేహితురాలు నివాసం ఉంటున్నది. ఐటీఐ పూర్తి చేసిన వినోద్ కారు, లారీ బాడీ తయారీ షెడ్ లో పని చేస్తున్నాడు. కాలేజ్ లో తనతోపాటు చదువుతున్న స్నేహితురాలి ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో జీవితకు వినోద్ పరిచయం అయ్యాడు.

 మా ఇంటికి మెకానిక్ అల్లుడు వద్దు !

మా ఇంటికి మెకానిక్ అల్లుడు వద్దు !

వినోద్, జీవిత పరిచయం ప్రేమకు దారితీసింది. జీవిత, వినోద్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని జీవిత, వినోద్ వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో సినిమా కథలో ఎదురైన సమస్య ప్రేమికులకు ఎదురైయ్యింది. మీ పెళ్లికి మేము అంగీకరించమని జీవిత, వినోద్ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. మా ఇంటికి మెకానిక్ అల్లుడు వద్దని జీవిత తండ్రి తెగేసి చెప్పాడు.

 లాక్ డౌన్ సమస్య తట్టుకోలేక !

లాక్ డౌన్ సమస్య తట్టుకోలేక !

కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో జీవితా కాలేజ్ కు సెలవులు ఇచ్చేశారు. ఇదే సమయంలో వినోద్ పని చేస్తున్న షెడ్ మూసివేయడంతో అతను ఇంటికే పరిమితం అయ్యాడు. కొన్ని రోజుల నుంచి జీవిత, వినోద్ కలుసుకోలేకపోయారు. కొన్ని రోజుల నుంచి ఇద్దరూ దూరం కావడంతో ఒకరిని ఒకరు చూడకుండా ఉండలేకపోయారు.

 ఏం జరిగినా పర్వాలేదని !

ఏం జరిగినా పర్వాలేదని !

ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన జీవిత, వినోద్ ఆదివారం ఇళ్ల నుంచి తప్పించుకుని పారిపోయారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే నలుగురు స్నేహితుల సహాయంతో కీల్ చింతామణి సమీపంలోని ద్రౌపది అమ్మాన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఏమైతే అదికాని అని జీవిత, వినోద్ నిర్ణయించుకున్నారు.

 పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు !

పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు !

తమ అమ్మాయికి వినోద్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని జీవిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీస్ ఇన్స్ పెక్టర్ షణ్ముగ వేల్ జీవిత, వినోద్ ఆచూకి తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. జీవిత, వినోద్ మేజర్లు కావడంతో వారు ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జీవిత, వినోద్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఇన్స్ పెక్టర్ షణ్ముగ వేల్ ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేమికుల జోలికిరాకూడదని సూచించారు.

Recommended Video

    Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home
    లాక్ డౌన్ పుణ్యమా అంటూ పెళ్లి !

    లాక్ డౌన్ పుణ్యమా అంటూ పెళ్లి !

    ప్రేమికులకు అండగా నిలబడిన పోలీసులు మీకు ఏం సమస్యలు వచ్చినా మేము ఉన్నామని హామీ ఇవ్వడంతో జీవిత కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. ఇక చేసేది ఏమీలేకపోవడంతో జీవిత, వినోద్ ను వదిలిసి వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఎవ్వరూ ఎలాంటి ఇబ్బందులు పెట్టకపోవడం, పోలీసులు అండగా నిలబడటంతో నవ దంపతులు జీవిత, వినోద్ ఊపిరి పీల్చుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+