Couple: రాత్రి పీకలదాక తాగి ఉరి వేసుకున్న భర్త, మరుసటి రోజు భర్త శవం చూసి షాక్ తో భార్య కూడా ?
చెన్నై/ పుదుకోటై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేస్తున్న భర్త అతని భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. దంపతులు సొంత ఇంటిలో వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించిన భర్త ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పడి ఉరి వేసుకున్నాడు, ఆసుపత్రిలో భర్త చనిపోయాడు. భర్త శవాన్ని ఇంటికి తీసుకురావడంతో షాక్ గురైన భార్య ప్రాణం పోయింది. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య కూడా షాక్ తో చనిపోవడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని పుదుకోటై జిల్లాలోని కిరనూర్ సమీపంలోని దువరవాయల్ సౌత్ ప్రాంతంలో తిరునావుక్కరసు (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వినీత అనే యువతిని తిరునావుక్కరసు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తిరునావుక్కరసు, వినీత దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

సొంత ఇంటిలో కాపురం
తిరునావుక్కరసు, వినీత దంపతులు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో బిడ్డకు సంవత్సరం వయసు ఉంది. మేస్త్రీ పని చేస్తున్న తిరునావుక్కరసు అతని భార్య వినీత, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. తిరునావుక్కరసు, వినీత దంపతులు సొంత గ్రామంలోని అతని సొంత ఇంటిలో వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.

మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త
ఇటీవల తిరునావుక్కరసు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన తిరునావుక్కరసు ఇంటికి వెళ్లాడు, మద్మం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త తిరునావుక్కరసుతో అతని భార్య వినీత గొడవపడింది. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో తిరునావుక్కరసు భార్య వినీత చీరతో ఉరి వేసుకున్నాడు.

భర్త శవం చూసి షాక్ తో భార్య ప్రాణం పోయింది
కొంతసేపటి తరువాత విషయం గమినించిన కుటంబ సభ్యులు తిరునావుక్కరసును ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం ఉదయం తిరునావుక్కరసు చనిపోయాడు. తిరునావుక్కరసు శవాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్లారు. భర్త శవాన్ని చూసిన వినీత కుప్పకూలిపోయింది. వెంటనే వినీతను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినీత ప్రాణాలు పోయాయనని వైద్యులు చెప్పారు. తండ్రి ఆత్మహత్య చేసుకోవడం, తల్లి షాక్ తో చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.












Click it and Unblock the Notifications