బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

COVID-19: కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఫర్ సేల్, జిరాక్స్ సెంటర్ లో హోల్ సేల్ రేట్, ఎగేసుకుని!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ విజయనగరం: కరోనా వైరస్ (COVID-19) సెకండ్ వేవ్ తో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే ప్రజలకు ఇప్పుడు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. ప్రజల అవసరాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ లో పేర్లు, చిరునామా మార్చేసి జిరాక్స్ సెంటర్ లో నకిలి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఫర్ సేల్ అని విక్రయించడంతో ప్రభుత్వ అధికారులు హడలిపోయారు. కూరగాయలు హోల్ సేల్ ధరకు విక్రయించినట్లు జిరాక్స్ సెంటర్ లో ఓ రేట్ ఫిక్స్ చేసి కోవిడ్ నెగటివ్ నకిలి సర్టిఫికెట్లు విచ్చలవిడిగా విక్రయించేశారు.

Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !

కరోనా అల్లకల్లోలం

కరోనా అల్లకల్లోలం

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో అల్లకల్లోలం మొదలైయ్యింది.

కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్

కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే ప్రజలకు, కాలేజ్ విద్యార్థులకు ఇప్పుడు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. ఏ రాష్ట్రం నుంచి ప్రజలు బయటకు వెలుతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారుల దగ్గర కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని మా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.

 డిమాండ్ ఎక్కువే.... అంత రిస్క్ అవసరామా ?

డిమాండ్ ఎక్కువే.... అంత రిస్క్ అవసరామా ?

ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ అధికారుల దగ్గర కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆ ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి. కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్ పేట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి వేలాది మంది సిద్దం అయ్యారు. ఇతర రాష్ట్రాలకు వెలుతున్న ప్రజల సొమ్ము లూటీ చెయ్యడానికి హోస్ పేట్ లోని ఓ జిరాక్స్ షాప్ నిర్వహకుడు కరోనా కాలంలో కోవిడ్ స్కెచ్ వేశాడు.

కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఫర్ సేల్

కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఫర్ సేల్

హోస్ పేట్ లోని శివరాజ్ జిరాక్స్ సెంటర్ నిర్వహకుడు శివరాజ్ అమాయకులైన ప్రజలను అడ్డం పెట్టుకుని కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు విచ్చలవిడిగా విక్రయించాడు. కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఓ కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ శివరాజ్ చేతికి చిక్కింది. అంతే ఆ సర్టిఫికెట్ లోని పేర్లు, చిరునామాలు, గుర్తింపు కార్డులు మార్చేసి ఆ సర్టిఫకెట్ లు జిరాక్స్ చేసి వాటిని అమాయకులైన ప్రజల ఫోటోలు, అడ్రస్ లు, ఐడీ కార్డులు అతికించి వాటిని విక్రయించాడు.

హాట్ కేకులు కాదు... హోల్ సేల్ రేట్ తో నకిలి సర్టిఫికెట్లు

హాట్ కేకులు కాదు... హోల్ సేల్ రేట్ తో నకిలి సర్టిఫికెట్లు

శివరాజ్ జిరాక్స్ సెంటర్ లో అప్పనంగా ఇస్తున్న కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు తీసుకుంటున్న కొందరు ప్రజలు, కాలేజ్ విద్యార్థులు వారివారి సొంత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిపోతున్నారు. విషయం తెలుసుకున్న హోస్ పేట్ టీహెచ్ఓ డాక్టర్ భాస్కర్ హోస్ పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కచ్చితమైన ఆధారాలతో కేసు నమోదు చేసిన పోలీసులు నకిలి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు ఇస్తున్న జిరాక్స్ షాప్ యజమాని శివరాజ్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి అతన్ని జైలుకు పంపించి విచారణ చేస్తున్నారు.

English summary
COVID-19: A fake Coronavirus report making at the Xerox shop in Hospet has come to light. The accused, Shivraj, was arrested by Hospet police and handed over to the judicial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X