April iit kanpur scientists tension maharashtra punjab covid 19 కరోనా వైరస్ ఆందోళన మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్ కోవిడ్ 19
కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ రెండో వారం తర్వాత పీక్స్ కు ... శాస్త్రవేత్తల హెచ్చరిక
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి . ఇప్పటికే రోజువారి కేసుల సంఖ్య నేడు 90 వేలకు చేరుకున్నట్లు గా అధికారిక గణాంకాలు చెప్పాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్టు గుర్తించగా, ఈ విజృంభణ ఏప్రిల్ నెల రెండో వారానికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వణికిస్తున్న కరోనా .. 90 వేలకు చేరువగా కొత్త కేసులు , 714 మరణాలు, టెన్షన్ లో సర్కార్ !!

గణిత నమూనాల ఆధారంగా కరోనా స్థితిని వెల్లడించిన శాస్త్రవేత్తలు
గణిత నమూనాల ఆధారంగా కరోనా స్థితిని వెల్లడించిన శాస్త్రవేత్తలు
గణిత నమూనాలను ఉపయోగించి అంచనా వేశామని శాస్త్రవేత్తలు ఏప్రిల్ రెండో వారం తర్వాత విజృంభించే కరోనా మే చివరినాటికి క్షీణిస్తుందని చెప్తున్నారు. దేశంలో కరోనా మొదటిదశ కంటే, రెండో దశలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూత్ర అనే గణాంక పద్ధతి ద్వారా కరోనా వ్యాప్తిని గుర్తించే అధ్యయనం చేసిన ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు గతంలోనూ గణిత నమూనాల ఆధారంగా అంచనా వేశారు .

గతేడాది కూడా శాస్త్రవేత్తల అంచనా .. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ రెండో వారానికి కరోనా పీక్స్
2020 సెప్టెంబర్ నెలలో వైరస్ తీవ్రత గరిష్టానికి చేరుకొని, 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని సూచించారు. కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య అంచనా వేయడానికి సూత్ర మోడల్ మూడు ప్రధాన పారా మీటర్స్ ను ఉపయోగిస్తుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇక అదే తరహాలో ప్రస్తుతం కూడా రెండో దశ కరోనా ఉదృతిని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీరుచూస్తే ఏప్రిల్ 15 - 20 వ తేదీ మధ్యకాలంలో పీక్స్ కు చేరుతుందన్న భావన కలుగుతుంది.

మే చివరి నాటికి కరోనా క్షీణత .. ఈ లోగా రోజుకు లక్ష కేసులకు పైమాటే
ఇక అదే తీరులో తగ్గుముఖం పడుతూ మే చివరినాటికి క్షీణిస్తోందని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త మణీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల కారణంగా రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్ల గరిష్ట విలువను అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం, ఇది రోజుకు 1 లక్ష పాజిటివ్ కేసులు నమోదు చేస్తుందని, అయితే ఇది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి రెండవ దశలో, ప్రభావితమైన మొదటి రాష్ట్రం కొద్ది రోజుల్లో పంజాబ్ కావచ్చు, తరువాత మహారాష్ట్ర ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఇది ప్రమాదకర సమయం ..అలెర్ట్ అంటున్న ప్రభుత్వాలు
హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయానికి చెందిన గౌతమ్ మీనన్‌తో సహా శాస్త్రవేత్తలు చేసిన స్వతంత్ర లెక్కలు, కోవిడ్ -19 పాజిటివ్ కేసుల రెండవ తరంగం ఏప్రిల్ మధ్య నుండి మే చివరి వరకు క్షీణించవచ్చని అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కరోనా నియంత్రణా చర్యలు చేపట్టారు . మరోపక్క కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగవంతం చేసిన ప్రభుత్వాలు శాస్త్రవేత్తల హెచ్చరికల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాయి .