వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి దాటేసింది దేవుడా, టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రా, సేఫ్ లో తెలంగాణ, ఐదు రాష్ట్రాలు పక్కపక్కనే, గోవిందా గోవింద!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ అమరావతి/ చెన్నై: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటిపోవడంతో ప్రజలు షాక్ అయ్యారు. భారతదేశంలో శుక్రవారం అర్దరాత్రి వరకు 1, 00, 04, 620 కేసులు నమోదు కాగా 1, 45, 167 మంది ఆ మహమ్మారి వ్యాధికి బలైనారు. దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన టాప్ టెన్ రాష్ట్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటంతో తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!

టాప్ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్

టాప్ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్

దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన టాప్ ఫైవ్ రాష్ట్రాలుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వరుసగా నిలిచాయి. దేశంలో చాలా జిల్లాల్లో ఇప్పటి వరకు 5 వేల కంటే తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. 11 జిల్లాల్లో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

నెంబర్ వన్ స్థానంలో మహారాష్ట్ర

నెంబర్ వన్ స్థానంలో మహారాష్ట్ర

దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 18, 88, 767 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 60, 352 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. 17, 78, 722 మందికి కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యింది. మహారాష్ట్రలో మొత్తం ఇప్పటి వరకు 1. 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కర్ణాటకలో ఎంత మందికంటే

కర్ణాటకలో ఎంత మందికంటే

దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కర్ణాటకలో ఇప్పటి వరకు 9, 07,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 15, 380 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. 8, 79, 735 మందికి కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యింది. కర్ణాటకలో మొత్తం ఇప్పటి వరకు 1. 3 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్రాలో అదరిపోయిన ప్రజలు

ఆంధ్రాలో అదరిపోయిన ప్రజలు

దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 8,77,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కేవలం 4,377 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. 8, 66, 359 మందికి కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 1. 1 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

తమిళనాడు తంబీలు బెదుర్స్

తమిళనాడు తంబీలు బెదుర్స్

దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నాలుగో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తమిళనాడులో ఇప్పటి వరకు 8, 04, 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో ఇప్పటి వరకు 9,781 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. 7, 82, 915 మందికి కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యింది. తమిళనాడులో ఇప్పటి వరకు మొత్తం 1. 3 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కేరళలో కరోనా కల్లోలం

కేరళలో కరోనా కల్లోలం

భారతదేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఐదో రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళలో ఇప్పటి వరకు 6,93, 866 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కేరళలో ఇప్పటి వరకు 58, 895 ఆక్టివ్ కేసులు ఉండటంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. 6, 32, 065 మందికి కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యింది. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 1. 3 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. టాప్ టెన్ స్థానాల్లో ఈ ఐదు రాష్ట్రాల తరువాత ఢిల్లీ, ఉత్దరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు టాప్ 10 లో నిలిచాయి. 11వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండటం విశేషం.

English summary
COVID-19: Top 5 Coronavirus Effected States In India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X