Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్‌ ఎన్నికల్లో సోషల్‌ మీడియా రచ్చ- బీజేపీకి లబ్ది కలగకుండా చూడాలని ఈసీకి ఫిర్యాదులు..

బీహార్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ-జేడీయూ కూటమి ధన ప్రవాహానికి తెరలేపుతోందని, సోషల్‌ మీడియాను తమకు అనుకూలంగా వాడుకుంటూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మహాకూటమి ఆరోపించింది. ఈవీఎంల్లో అక్రమాలకు కూడా పాల్పడే అవకాశముందని మహాకూటమి ఆందోళన వ్యక్తం చేసింది.

బీహార్ ఎన్నికల్లో ధనప్రవాహం, సోషల్‌ మీడియా వాడకం, ఈవీఎంల అక్రమాలపై ఈసీ కఠినంగా వ్యవహరించాలని మహాకూటమి భాగస్వామి సీపీఎం ఈసీని కోరింది. ఈ మేరకు తాజాగా ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసింది. గతంలో ఇదే అంశంపై ఫిర్యాదు చేసినా ఈసీ నుంచి సమాధానం రాలేదని లేఖలో సీపీఎం తెలిపింది. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్‌లో ఫేక్ ఖాతాలను సృష్టించడం ద్వారా బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీహార్‌ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా సాయంతో బీజేపీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని మహాకూటమి ఆరోపిస్తోంది.

cpi(m) flags concerns over funding, social media and evms to ec in bihar elections

Recommended Video

    Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan

    బీహార్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఇప్పటికే 72 వేల వాట్సాప్‌ గ్రూపులను ప్రారంభించినట్లు అధికారికంగానే చెబుతోంది. వీటిలో 50 వేల ఖాతాలు రెండు నెలల క్రితమే ప్రారంభించింది. వీటిని నిర్వహించేందుకు 9500 మంది సిబ్బందిని కూడా నియమించుకుంది. పోలింగ్ బూత్‌కు ఒకరు చొప్పున వీరు పనిచేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ భారీగా ఖర్చుచేస్తోందని, ఎన్నికల్లో సోషల్‌ మీడియా వాడకం ద్వారా అనుచితంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+