బిపార్జోయ్ తుపాను ఎఫెక్ట్: రాజస్థాన్‌లో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్, 14 రైళ్లు రద్దు
జైపూర్: గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన బిపార్జోయ్ తుపాను ఇప్పుడు రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం గుజరాత్‌లో బీపర్‌జోయ్ తుఫాను బలహీనపడటంతో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో 14 రైళ్లు రద్దు చేయబడ్డాయి. భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షం హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో రాజస్థాన్ ప్రభుత్వం తాత్కాలికంగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది.
అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు, తుపాను ప్రభావిత ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిపార్జోయ్ తుఫాను, భారతదేశ పశ్చిమ తీరప్రాంతంపై దాని ప్రభావం గురించి వివరాలు ఇలా ఉన్నాయి..
బీపార్జోయ్ తుఫాను ప్రభావంతో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో రైలు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 14 రైళ్లను రద్దు చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షపు హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో సహాయక శిబిరాలను రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

బిపార్జోయ్ తుఫాను గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంగా మారడానికి ముందు విధ్వంసం సృష్టించింది. ఈ అల్పపీడనం జలోర్, సిరోహి, బార్మర్, జోధ్‌పూర్, జైసల్మేర్, పరిసర ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే ఐఎండీ ప్రకారం.. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం వరకు ఎక్కువ వర్షాలను అంచనా వేసింది. జాలోర్, బార్మర్‌లలో "రెడ్" హెచ్చరిక జారీ చేసింది. 200 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ముందుజాగ్రత్త చర్యగా రెడ్ అలర్ట్ కింద జిల్లాల్లో సహాయ శిబిరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. పీటీఐ నివేదిక ప్రకారం.. భారీ వర్షాల వల్ల ప్రభావితమయ్యే జిల్లాల్లో MGNREGA (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ప్రాజెక్టులు నిలిపివేయబడ్డాయి. శని, ఆదివారాల్లో బార్మర్, జాలోర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) నుంచి 30 బృందాలు, అదనపు రిజర్వ్ టీమ్‌లతో సహా రెస్క్యూ టీమ్‌లు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వీలైనంత త్వరగా స్పందించేలా చూసేందుకు రెడ్ అలర్ట్ కింద జిల్లాల్లో మోహరించారు.












Click it and Unblock the Notifications