వెటరన్ స్టార్ హీరోకు ప్రిస్టేజియస్ అవార్డ్
Mithun Chakraborty: బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఈ అవార్డు కోసం ఎంపిక చేయడానికి ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మిథున్ చక్రవర్తి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కోసం జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన 70వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందిస్తామని అన్నారు.

ఈ అవార్డుకు నామినేట్ అయిన సందర్భంగా అశ్విని వైష్ణవ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోల్‌కత వీధుల్లో నుంచి సినిమా అత్యున్నత శిఖరానికి చేరుకున్నారంటూ కితాబిచ్చారు. మున్ముందు మరిన్ని ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు.
మిథున్ చక్రవర్తి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాల కిందటే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోన్నారు.
Mithun Da’s remarkable cinematic journey inspires generations!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 30, 2024
Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor, Sh. Mithun Chakraborty Ji for his iconic contribution to Indian Cinema.
🗓️To be presented at the 70th National…
1976లో మృగయా సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు మిథున్. తెలుగు, తమిళం, కన్నడం, పంజాబీ, ఒరియా, భోజ్‌పురి సహా దాదాపుగా అన్ని భారతీయ సినిమాల్లోనూ నటించారు. 80వ దశకంలో ఓ ట్రెండ్ సెట్టర్. తెలుగులో మలుపు, గోపాల గోపాల, తమిళంలో యాగవరైయునుమ్ నా కాక్క, కన్నడంలో ది విలన్.. సినిమాల్లో మెరిశారు.

బెస్ట్ సెల్లర్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో నటించారు మిథున్ దా. 1989లో ఒకే సంవత్సరం 19 సినిమాలు విడుదల అయ్యాయంటే అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది.
గత ఏడాది కాబూలీవాలా, అంతకుముందు ది కాశ్మీరీ ఫైల్స్‌లో నటించారు. ప్రస్తుతం శాస్త్రి అనే బెంగాలీ మూవీలో నటిస్తోన్నారు. అది సెట్స్‌పై ఉంది. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. మరికొన్నింటికి దర్శకత్వం వహించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలకు ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కోసం ఆయన పేరు నామినేట్ అయింది.
-
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications