వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: దేశంలో అవినీతి తగ్గుదల, కానీ ...అవినీతిలో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిర్వహణ కోసం అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల్లో అవినీతిపై సిఎంఎస్ నిర్వహించిన సర్వేలో దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో అత్యంత పరమచెత్తగా ఉన్నాయి. పైసలు ఇవ్వనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. కర్ణాటక తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది.

దేశంలోని 20 రాష్ట్రాల్లో 2013 నుండి 2017 మధ్యలో అవినీతిపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే నిర్వహించింది.ఈ సర్వే ప్రకారంగా కర్ణాటక రాష్ట్రం అవినీతిలో ప్రథమస్థానంలో నిలిచింది.ఆ తర్వాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంద్రప్రదేశ్ తర్వాతి స్థానాన్ని తమిళనాడు నిలిచింది.

అయితే దేశవ్యాప్తంగా అవినీతి విషయంలో కొంత తగ్గుదల కన్పించినప్పటికీ దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితుల్లో మార్పులు రాలేదనే అభిప్రాయాన్ని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Definite Decline in Corruption; 3 States in South India the Worst, Says Study

2005 నుండి 2017 మధ్య కాలంలో అవినీతి విషయంలో ప్రజలు జాగ్రత్త పెరిగిందని చెప్పారు..అయితే సుమారు 43 శాతం ఇంటి హౌజ్ హొల్డర్స్ ను ఈ సర్వే నిర్వహిచంారు.

దేశంలోని 20 రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా 77 శాతం ప్రజలు అవినీతి కారణంగా ఇబ్బంది పడుతున్నారని తేలింది.ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 74 శాతం ప్రజలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు రాష్ట్రం నిలిచింది. తమిళనాడులో 68 శాతం ప్రజలు అవినీతితో ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 57 శాతం ప్రజలు అవినీతితో ఇబ్బందిపడుతున్నారు.జమ్మూ కాశ్మీర్ లో 44 శాతం ప్రజలు అవినీతి కారణంగా ఇబ్బందిపడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ నిలిచింది.42 శాతం ప్రజలు పంజాబ్ రాష్ట్రంలో అవినీతికి అధికారులు పాల్పడుతున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని 20 రాష్ట్రాల్లోని 10 పబ్లిక్ సేవలకు సంబందించి సుమారు రూ.6,350 కోట్లను ఖర్చు చేసినట్టు సిఎంఎస్ అంచనావేసింది. అయితే ఈ అవినీతి 2005 తో పోలిస్తే తగ్గుదల కన్పిస్తోంది.అయితే 2005 ఈ సేవలకు గాను 20 రాష్ట్రాల్లో సుమారు రూ.20,500 కోట్లను ఖర్చు చేశారు.

అయితే ఈ విషయాలపై దృష్టిని కేంద్రీకరించాలని నీతి ఆయోగ్ ను కోరినట్టు సిఎంఎస్ ఛైర్మెన్ భాస్కర్ రావు చెప్పారు. అయితే 2005 లో పరిస్థితి మరోలా ఉంది. ఆ సమయంలో బీహార్ రాష్ట్రంలో 74 శాతం అవినీతి ఉండేది. ఆ తర్వాతి స్థానంలో జమ్మూ కాశ్మీర్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 69 శాతం అనినీతి ఉండేది. ఒడిశాలో 60 శాతం, రాజస్థాన్ లో 59 శాతం , ఆ తర్వాత స్థానంలో తమిళనాడు 59 శాతంతో నిలిచింది.అయితే 2005 తో పోలిస్తే కొన్ని రాష్ట్రాల్లో అవినీతి తగ్గింది.కాని, దక్షిణాది మూడు రాష్ట్రాల్లో మాత్రం అవినీతి పరమ చెత్తగా ఉంది.

డీమోనిటీజేషన్ అమలు చేసిన తర్వాత టెలిఫోన్ సర్వే కూడ నిర్వహించినట్టుగా సిఎంఎస్ ప్రకటించింది.అయితే డీమానిటీజేషన్ వల్ల అవినీతి తగ్గిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.

English summary
There has been a "definite decline" in petty corruption in the country between 2013 and 2017, a new survey by the Centre for Media Studies (CMS) has reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X