పోలీసు క్వాటర్స్ మీద నుంచి దూకి డిగ్రీ కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య, డెత్ నోట్ లో !

బెంగళూరు/బళ్లారి/మంగళూరు: హిందూ అబ్బాయి, ముస్లీం అమ్మాయికి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమికుల మద్య గొడవ జరగడంతో ప్రియుడి మీద రేప్ కేసు పెట్టి జైలుకు పంపించింది. తరువాత ప్రియుడితో రాజీ అయిన ప్రియురాలు పోలీసు క్వాటర్స్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కర్ణాటకలోని మంగళూరులో ఆయేషా (22) అనే యువతి నివాసం ఉంటున్నది. బళ్లారిలో బీమేష్ నాయక్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. పోటీ పరీక్షలు రాసే సమయంలో ఆయేషాకు, బీమేష్ నాయక్ కు పరిచయం కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. హిందూ మతంలోకి మారితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని బీమేష్ నాయక్ అతని ప్రియురాలికి చెప్పింది.

deadbodys

హిందూ మతం స్వీకరించడానికి ఆయేషా నిరాకరించడంతో ఇద్దరి మద్య గొడవలు జరిగాయి, తన మీద బీమేష్ నాయక్ అత్యాచారం చేశాడని రెండు సంవత్సరాల క్రితం ఆయేషా బెంగళూరులోని బసవణగుడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు బీమేష్ నాయక్ ను మూడు నెలలు జైల్లో పెట్టడంతో తరువాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు.

తన మీద అత్యాచారం జరగలేదని, తనను క్షమించాలని, కేసు వెనక్కి తీసుకుంటానని ఆయేషా హైకోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు కొట్టేశారు. తరువాత మంగళూరులోని సెయింట్ ఆగ్నేష్ కాలేజ్ లో ఆయేషా బీఎస్సీ చదువుతోంది. కొంతకాలం నుంచి ఆయేషా బెంగళూరులోని బీమేష్ నాయక్ ఇంటిలోనే ఉంటున్నది.

deadbodys

ఆదివారం బిన్నీపేట్ లోని పోలీసు క్వాటర్స్ లోని 7వ అంతస్తు మీదకు వెళ్లిన ఆయేషా అక్కడి నుంచి కిందకు దూకేయడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆయేషా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిందని పోలీసులు అన్నారు. బీమేష్ ఐ లవ్ యూ, నిన్ను జైలుకు పంపించి నేనే చాలా తప్పు చేశాను, నేను ఆ విషయం మరిచిపోలేకుండా ఉన్నానని, నాన్న నన్ను క్షమించి అని రాసి ఉందని పోలీసులు అన్నారు.

తన కూతురు ఆయేషా ఆత్మహత్య విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు లేవని, శవం ఇస్తే తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటామని ఆయేషా తండ్రి బోరున విలపించడంతో పోలీసులు సైతం చలించిపోయారు. ఆయేషా డెత్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరిశీలిస్తున్నామని, కేసు విచారణలో ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+