ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025 LIVE: కేజ్రీవాల్ కోట బద్దలు.. ఫలించిన మోదీ మ్యాజిక్

Delhi Assembly Election Results 2025 Live: ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం జరిగాయి. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇక 70 స్థానాలకు సంబంధించి 2025 ఫిబ్రవరి 8,శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఇస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు. బీజేపీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ ఢిల్లీలో కనుమరుగైంది.

ఇక మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీనే అధికారం చేపడుతుంది అని జోస్యం చెప్పాయి.ఆప్‌కు ఎదురుదెబ్బ తప్పదనే అంచనాలు ఇచ్చాయి. అదే నిజమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం వికసించింది. ఇక ఢిల్లీలో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

11:42 PM, 8 Feb

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

11:05 PM, 8 Feb

విజయోత్సవ వేడుకల అనంతరం అమిత్ షా, జేపీ నడ్డా బీజేపీ కార్యాలయం నుంచి బయల్దేరిన దృశ్యం.

10:58 PM, 8 Feb

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమితో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేకు భారీ ఊరట లభించిందన్నారు ప్రధాని మోడీ.

9:42 PM, 8 Feb

కల్కాజీ స్థానం నుంచి గెలుపొందిన ఢిల్లీ ఔట్ గోయింగ్ సీఎం అతిశీ పార్టీ శ్రేణులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

9:39 PM, 8 Feb

ఢిల్లీలో భారీ విజయంతో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నాయి.

9:36 PM, 8 Feb

షార్ట్ కట్ రాజకీయ నాయకులకు ఢిల్లీ ప్రజలు షాట్ సర్క్యూట్ ఇచ్చారని ఆప్ నేతలనుద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.

9:14 PM, 8 Feb

ఆప్ ప్రభుత్వంలో తీవ్ర కాలుష్యానికి గురైన యమునా నదిని ప్రక్షాళన చేస్తామన్నారు ప్రధాని మోడీ.

8:47 PM, 8 Feb

డబుల్ ఇంజిన్ సర్కారుతో ఢిల్లీలో అభివృద్ధి పరుగుపెడుతుందన్నారు ప్రధాని మోడీ.

8:16 PM, 8 Feb

ఢిల్లీని పదేళ్లపాటు అహంకారంతో పాలించారని ప్రధాని మోడీ ఆప్ సర్కారుపై మండిపడ్డారు.

7:30 PM, 8 Feb

ఢిల్లీ మామూలు నగరం కాదు.. మినీ భారత్‌. ఢిల్లీలో గెలిచామంటే దేశమంతా బీజేపీని దీవించినట్లే. దిల్లీ అభివృద్ధికి నాది గ్యారెంటీ అని ప్రధాని మోదీ అన్నారు..

7:27 PM, 8 Feb

లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు మొత్తం సీట్లు మాకే ఇచ్చారని పేర్కొన్న ప్రధాని మోదీ. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుపై ఇక్కడి ప్రజలు నమ్మకం ఉంచారు. హరియాణా, మహారాష్ట్రలో కూడా గొప్ప విజయం సాధించామని చెప్పారు.

7:27 PM, 8 Feb

నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే. అడ్డదారుల్లో వచ్చిన వారికి ప్రజలు షాక్‌ ఇచ్చారన్న మోదీ

7:26 PM, 8 Feb

ఇక నుంచి ఢిల్లీలో వికాస్‌, విజన్‌, విశ్వాస్‌ నినాదాలతో పరిపాలన సాగుతుందని ప్రధాన మోదీ అన్నారు. బీజేపీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు

7:24 PM, 8 Feb

ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు పెంచి తిరిగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించిందన్నారు.

7:23 PM, 8 Feb

ఢిల్లీలో విజయం సామాన్య విజయం కాదు. వికసిత్‌ రాజధానిగా మార్చే అవకాశం మాకు ఇచ్చారని ప్రదాని మోదీ అన్నారు. ఢిలీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. మా పార్టీపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

7:20 PM, 8 Feb

ఢిల్లీ తీర్పును అంగీకరిస్తున్నామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ. ఢిల్లీ అభివృద్ధి, స్థానికుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ట్వీట్‌ చేశారు. కాలుష్యం, అధిక ధరలు, అవినీతి సమస్యలను లేవనెత్తుతూనే ఉంటామని వెల్లడించారు.

6:51 PM, 8 Feb

ఢిల్లీ ప్రజలు మోదీ గ్యారంటీని విశ్వసించారని పేర్కొన్న ప్రధాని మోదీ

6:49 PM, 8 Feb

ఇవాళ ఢిల్లీ ప్రజల్లో కొత్త విశ్వాసం కనిపిస్తోందన్న ప్రధాని మోదీ

6:48 PM, 8 Feb

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగం. "యమునా మైయా కీ జై" అని ప్రసంగించారు.

6:47 PM, 8 Feb

విద్య పేరుతో ప్రజలను ఆప్ తప్పుదారి పట్టించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు అలాంటి (ఆప్) పార్టీ అవసరం లేదని ఈ ఎన్నికలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. 'ఆప్-డా' అనేది అబద్ధాల కర్మాగారం , అవినీతికి కొత్త మార్గాలను కనుగొనే కర్మాగారం..." అని అన్నారు.

6:45 PM, 8 Feb

అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించార. గతేడాది లోక్‌సభలో ఏడుకు ఏడు సీట్లు, ఇప్పుడు అసెంబ్లీలో 48 సీట్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ ఫలితాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతోందని.. ‘దిల్లీ హృదయంలో మోదీ ఉన్నార’ని వ్యాఖ్యానించారు.

6:27 PM, 8 Feb

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ. ఘనంగా స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు . విజయోత్సవ సభలో పాల్గొన్న మోదీ.

6:24 PM, 8 Feb

బిజెపికి భారీ అందించిన ఢిల్లీ ప్రజలుకు కృతజ్ఞతలు తెలిపారు న్యూఢిల్లీ నుండి బిజెపి గెలిచిన అభ్యర్థి పర్వేశ్ వర్మ . ఈ విజయం ప్రధాని మోదీకి చెందుతుందన్నారు.

6:13 PM, 8 Feb

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాల్లో పాల్గొన్న ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, బిజెపి ఎంపీలు మనోజ్ తివారీ, బన్సూరి స్వరాజ్

6:02 PM, 8 Feb

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కాసేపట్లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

6:00 PM, 8 Feb

కేంద్రంలో బీజేపీ, స్థానికంగా ఆప్‌ పదేళ్లుగా అధికారంలో ఉన్నాయని, ఢిల్లీ దుస్థితికి అవి రెండే కారణమని కాంగ్రెస్‌ ఎంపీ కుమారి సెల్జా విమర్శలు గుప్పించారు. ఈ అవకాశాన్ని బీజేపీ ఎలా వినియోగిస్తుందో చూద్దామని, ప్రభుత్వ పనితీరును తామూ విశ్లేషిస్తామని చెప్పారు.

5:46 PM, 8 Feb

ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా . విజయం సాధించిన ఎమ్మెల్యేకు అభినందలు.

5:38 PM, 8 Feb

ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా.

5:01 PM, 8 Feb

ఢిల్లీ ఫలితాలు: బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో గెలుపు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టనున్న కమలం.

4:59 PM, 8 Feb

ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఢిల్లీ ప్రజలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ దూరం చేశారని హరియాణా సీఎం నాయబ్‌సింగ్‌ సైనీ ఆరోపణలు చేశారు. తన లోపాలను కప్పిపుచ్చేందుకే.. నీళ్లలో విషం కలిపారంటూ హరియాణాను నిందించారని, తమ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అలాంటి పనులు చేయరని పేర్కొన్నారు.

READ MORE

Delhi Assembly Election Results 2025 Live Updates Real Time Vote Counts Highlights in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+