Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ భార్య?

Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌.. ఏప్రిల్ 3వ తేదీన ఢిల్లీ హైకోర్టు సమక్షానికి విచారణకు రానుంది. ఇదివరకే ఈ పిటీషన్‌పై వాదోపవాదాలను ఆలకించింది హైకోర్టు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు, కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు. అనంతరం బెయిల్ పిటీషన్లపై విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు.

Delhi CM Arvind Kejriwal s wife Sunita Kejriwal to attend INDIA alliance rally

అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీని కూడా వారు స్తంభింపజేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఆందోళనలు కొనసాగాయి. లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ దీని తీవ్రత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజాగా- ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సైతం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జోక్యం చేసుకుంది. తొలిసారిగా ఇండియా నాయకులు ఒకే వేదికపైకి రానున్నారు. ఇంకాస్సేపట్లో దేశ రాజధానిలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రామ్ లీలా మైదాన్ వేదికగా రోజంతా ఈ నిరసన కొనసాగించనున్నారు.

ఈ ఆందోళనకు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ హాజరు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా కూటమి నాయకులతో కలవడం, ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరు కాబోతోండటం ఇదే తొలిసారి. దీనితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత కేజ్రీవాల్ అడుగు పెట్టినట్టవుతుంది.

Delhi CM Arvind Kejriwal s wife Sunita Kejriwal to attend INDIA alliance rally

తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా ఇన్ని రోజుల పాటు ఆమె విమర్శలు చేస్తూ వచ్చారే తప్ప ప్రత్యక్షంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో గానీ, ఆందోళనల్లో గానీ పాల్గొనలేదు. అలాంటిది- ఏకంగా ఇండియా కూటమి చేపట్టే నిరసన ప్రదర్శనలకు హాజరు కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది.

ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితే ఎదురైతే.. సునీత కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలను అందుకుంటారనే ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవ రూపాన్ని దాల్చుతాయనేది వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+