కేజ్రీవాల్‌కు బిగుసుకున్న ఉచ్చు: నో రిలీఫ్.. తీహార్ జైలుకు..!

Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ అదుపులో ఉన్నారామె. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈడీ కస్టడీకి తరలించింది ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

Delhi court sends CM Arvind Kejriwal to judicial custody till April 15

కేజ్రీవాల్ కస్టడీ గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు తన వాదనలను వినిపించారు. 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తమకు సహకరించలేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేలా, తనకు ఏ మాత్రం సంబంధం లేనివిధంగా వ్యవహరించారని అన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈడీ అధికారులు కోరిన విధంగా 15 రోజుల పాటు కస్టడీకి తరలించాలని ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ పంపిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ న్యాయస్థానంలోనే ఉన్నారు. విచారణ కోసం తొలిసారిగా ఆమె కోర్టుకు వచ్చారు.

ఈ 15 రోజుల పాటు విచారణ నిర్వహించడానికి వీలుగా కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు తీహార్ కేంద్ర కారాగారానికి తరలించే అవకాశం ఉంది. ఈ మేరకు అక్కడ వీఐపీ బ్యారక్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+