దినకరన్‌కు మరో షాక్: 'ఆధారాలున్నాయి, అరెస్ట్ చేస్తాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన టిటివి దినకరన్‌కు మరో షాక్ తగిలింది. ఆయనకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముందుస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

దినకరన్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లకుండా నిరోధించేందుకు ప్రధాన విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

చిన్నమ్మ కథ అడ్డం తిరిగింది!: పార్టీ చీఫ్ ఇప్పటికీ శశికళనే.. కానీ?

ఈ కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. ఈసీకి లంచం ఇవ్వచూపిన కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దినకరన్‌ను అరెస్ట్ చేస్తామని, ఇప్పటికే విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశామన్నారు.

Delhi police issue lookout notice against Dhinakaran

అలాగే దినరన్‌తో సుఖేష్ చంద్రసేఖర్‌కు ఉన్న సంబంధాలపై తాము ఆరా తీస్తున్నట్లు తెలిపారు. సుఖేష్‌ను అరెస్ట్ చేసిన రోజు కూడా అతను దినకరన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించామని చెప్పారు.

సుఖేష్‌కు గత నాలుగేళ్లుగా దినకరన్ తెలుసునని తమ విచారణలో తేలిందని చెప్పారు. వీరిద్దరు పలు సందర్భాలలో కలుసుకున్నారని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tightening the noose around Sasikala's nephew and AIADMK deputy general secretary T T V Dhinakaran, the crime branch of Delhi Police has got issued a lookout notice against him.
Please Wait while comments are loading...