వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ముందస్తు విడుదల..? ముమ్మర ప్రయత్నాల్లో టీటీవీ..! ఆసక్తిగా మారనున్న తమిళ రాజకీయం..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

శశికళ ముందస్తు విడుదల..? ముమ్మర ప్రయత్నాల్లో టీటీవీ..! || Sasikala Will Be Released From Jail Early

చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయా..? మరో సారి రాజకీయ అస్థిరత చోటుచేసుకోబోతోందా..? ఎడప్పాడి ప్రభుత్వం వచ్చే శాసన సభ ఎన్నికల వరకూ ఉండదా..? అదికార మార్పడి తప్పదా..? కొత్త ముఖ్యమంత్రి మళ్లీ కొలువుదీరనున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మగా ముద్ర పడ్డ చిన్నమ్మ అలియాస్ శశికళ ముందస్తుగా జైలునుండి విడుదలై తమిళ నాడు రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ తమిళనాడులో జోరుగా జరుగుతోంది. అసలు చిన్నమ్మ విడుదల అంశం ఇంత అకస్మాత్తుగా తెరమీదకు ఎందుకు వచ్చింది.? అందులో బీజేపి ప్రమేయం ఎంత వరకు ఉంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

 శశికళ ముందస్తు విడుదలపై ఉత్కంఠ..! చురుగ్గా పావులు కదుపుతున్న టీటీవీ దినకరన్‌..!!

శశికళ ముందస్తు విడుదలపై ఉత్కంఠ..! చురుగ్గా పావులు కదుపుతున్న టీటీవీ దినకరన్‌..!!

కర్ణాటక పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ ముందుగానే విడుదలైతే అన్నాడీఎంకేలోని ఆమె పూర్వపు విశ్వాసపాత్రుల వైఖరి ఏంటి? తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఇప్పటి నుంచే ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఏఎంఎంకే నుంచి ఒక్కొక్క కీలక నేత వెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజకీయ పరిస్థితిని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్షపడి రెండున్నరేళ్లుగా జైలులో ఉన్న 'చిన్నమ్మ' శశికళను ముందుగానే బయటకు తీసుకొచ్చేందుకు సత్ప్రవర్తన నిబంధనల మేరకు చర్యలు చేపట్టినట్టు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తెలిపారు. ఆమె అతి త్వరలో విడుదలవుతారని ధీమా వ్యక్తం చేశారు. శిక్షా కాలానికి ముందే 'చిన్నమ్మ' విడుదలైతే రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై పలు విశ్లేషణలు మొదలయ్యాయి.

 అన్నాడీఎంకేలో పలువురు ఆమె వైపేనా..? ప్రభుత్వంలో తప్పని కుదుపులు..!!

అన్నాడీఎంకేలో పలువురు ఆమె వైపేనా..? ప్రభుత్వంలో తప్పని కుదుపులు..!!

శశికళ బయటకు వస్తే అన్నాడీఎంకేలోని పూర్వపు విశ్వాసులు తప్పకుండా ఆమెను కలుస్తారని, అప్పుడు మళ్లీ పార్టీ వ్యవహారాలు ఆమె కనుసన్నల్లోకి వెళ్తాయనే వాదన తమిళ నాడు రాజకీయాల్లో వినిపిస్తోంది. దీనికి పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యలు బలం చేకూర్చేవిగా మారాయి. ఈ నెల 22న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, శశికళను చట్టపరంగా బయటకు తీసుకొస్తే సంతోషమేనని, అధికారంలో ఎలాంటి మార్పు జరగబోదని తెలిపారు. అమాత్యుడి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అమాత్యులు ఇంకా ఆమె విశ్వాసులుగానే ఉన్నారని, 'చిన్నమ్మ' బయటకు రాగానే ఆమె వద్దకు వెళ్లిపోతారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

 జయలలిత సమాధిపై శపథం చేసిన శశికళ..! అన్నాడీఎంకేను తన నుంచి ఏ శక్తి విడదీయలేదన్న చిన్నమ్మ..!!

జయలలిత సమాధిపై శపథం చేసిన శశికళ..! అన్నాడీఎంకేను తన నుంచి ఏ శక్తి విడదీయలేదన్న చిన్నమ్మ..!!

కీలక నేతలు, మంత్రులు, పార్టీ ప్రముఖులు 'చిన్నమ్మ' వైపునకు చేరితే అన్నాడీఎంకేలో కుదుపులు తప్పవని, శశికళను అన్నాడీఎంకే నుంచి తప్పించినట్టు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో ఆమె నాయకత్వాన్ని అందరూ కోరుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. జైలుకెళ్లే ముందు జయలలిత సమాధిపై చేతితో బలంగా చరుస్తూ అన్నాడీఎంకేను తన నుంచి ఏ శక్తి విడదీయలేదని, కుట్ర, ద్రోహం, ఇబ్బందుల నుంచి తిరిగి వస్తానంటూ శశికళ శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏఎంఎంకే రద్దయ్యే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఏఎంఎంకేను అన్నాడీఎంకేలో విలీనం చేయవచ్చని, లేకపోతే శశికళతో టీటీవీ దినకరన్‌ విభేదించి ఏఎంఎంకేను ముందుకు నడిపించవచ్చని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

 కొలువుదీరనున్న బీజేపి ప్రభుత్వం..! కర్ణాటక సర్కారు వైఖరిపై నెలకొన్న ఆసక్తి...!!

కొలువుదీరనున్న బీజేపి ప్రభుత్వం..! కర్ణాటక సర్కారు వైఖరిపై నెలకొన్న ఆసక్తి...!!

శశికళ ముందుగానే విడుదలైతే ఆమె కచ్చితంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తారని కమల దళం భావిస్తోంది. అందువల్ల ఆమె ముందస్తు విడుదలను కేంద్రంలోని బీజేపి కోరుకోవడం లేదని సమాచారం. శశికళ ముందుస్తు విడుదలకు టీటీవీ దినకరన్‌ ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టిన నేపథ్యంలో కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలు దానికి ప్రతికూలంగా మారాయి. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి బలపరీక్షలో ఓడటంతో ఆ ప్రభుత్వం కూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు యడ్యూరప్ప అవకాశం కోరగా ఆ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌ స్వాగతించారు. కర్ణాటక శాసనసభలో బీజేపి సర్కార్‌ మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. కర్ణాటకలో బీజేపి ప్రభుత్వం ఏర్పడితే శశికళ ముందస్తు విడుదలకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం కూడా తెరపైకి వచ్చింది.

English summary
There is a debate in Tamil Nadu that Sasikala will be released from jail early and will play a major role in Tamil Nadu politics again. Why the release of the Shashikala suddenly come on the screen? What the extent of the BJP's involvement in it. Let's try to find out ..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X