వివాహం: షాపింగ్‌కు తీసుకెళ్లలేదని యువతి ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం.. పెయింటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దుల్ కూతురు సిరిన్ సాబు. ఆమెకు ఆగస్టు మొదటి వారంలో వివాహం నిశ్చయించారు. కాగా, సోమవారం వివాహ దుస్తులు కొనేందుకు కుటుంబ సభ్యులందరూ షాపింగ్‌కు వెళ్లారు.
షాపింగ్‌కు వద్దనడంతో సిరిన్ సాబు ఒక్కతే ఇంట్లోనే ఉండిపోయింది. కాగా, షాపింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన ఆమె తల్లికి పైకప్పుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది సిరిన్ సాబు. దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు.
ఆమె మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ లభించింది. ఆమె షాపింగ్ వెళ్లాలనుకుందని, అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications