వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా: అరెస్టు తర్వాత అల్లర్లకు రూ.5 కోట్లు, ఆ ఇద్దరే కీలకం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంచకుల: అత్యాచారం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మిత్ రామ్‌ రహీమ్ సింగ్ ‌తీర్పుపై నేపథ్యంలో హింసాకాండకు దిగాలని మద్దతుదారులకు రూ. 5 కోట్లను ముట్టజెప్పారని సిట్ విచారణలో వెలుగుచూసింది.అయితే ఈ కేసులో ఇద్దరు కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలు డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలు

డేరా సచా సౌధా కీలకసభ్యులు ఆదిత్య ఇన్సాన్, హనీప్రీత్ ఇన్సాన్, సురేంర్ ధిమన్ ఇన్సాన్‌లను సిట్ సభ్యులు విచారించారు. ఈ విచారణలో హింసకు సంబంధించిన కీలక విషయం వెలుగుచూసింది.

డేరా బాబా: ఆశ్రమంలో ఈఫిల్‌టవర్,తాజ్‌మహల్, రిసార్ట్స్ డేరా బాబా: ఆశ్రమంలో ఈఫిల్‌టవర్,తాజ్‌మహల్, రిసార్ట్స్

ఇద్దరు సాధ్వీలపై డేరా బాబా అత్యాచారం చేశారనే ఆరోపణలపై సిబిఐ కోర్టు శిక్షను ఖరారుచేయడంతోనే హింస చెలరేగింది. అయితే బాబాపై ప్రేమతో స్వఛ్చంధంగా ఈ అల్లర్లు జరగలేదని తేలింది. పకడ్బందీ వ్యూహం ప్రకారంగానే ఈ దాడులకు డేరాబాబా అనుచరులు కుట్ర చేశారని సిట్ విచారణలో బయటపడింది.

అల్లర్లలో చంకూర్‌సింగ్ కీలకపాత్ర

అల్లర్లలో చంకూర్‌సింగ్ కీలకపాత్ర

డేరా యాజమాన్యం నుంచి నిధులు వసూలు చేసి ఖర్చు చేయడంలో డేరా పంచ్‌కుల బ్రాంచ్ హెడ్ చంకూర్ సింగ్ కీలకంగా వ్యవహరించారని సిట్ విచారణలో తేలింది. ఆగష్టు 28న, హైకోర్టు ఆదేశాలతో చంకూర్‌సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుండి చంకూర్‌సింగ్ తప్పించుకు తిరుగుతున్నారు.

హింసను ప్రేరేపించేందుకు డబ్బులు పంచారు

హింసను ప్రేరేపించేందుకు డబ్బులు పంచారు

అత్యాచారం కేసులో గుర్మీత్‌ను దోషిగా నిర్దారించిన వెంటనే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో డేరా మేనేజ్‌మెంట్ హింసను రెచ్చగొట్టేందుకు డబ్బులు పంపిందని సిట్ విచారణలో తేలింది. హింసాకాండలో మరణిస్తే పరిహరం ఇస్తామని కూడ డేరా అనుచరులు హమీ ఇచ్చారని సిట్ విచారణలో కొందరు తెలిపారు.

ఉద్యానవన శాస్ర్తవేత్త కీలక పాత్ర

ఉద్యానవన శాస్ర్తవేత్త కీలక పాత్ర

ఆందోళనకారులకు వాహనాలు సమకూర్చినవారిపై నిఘాను ఏర్పాటుచేసినట్టు హర్యానా డిజిపి బిఎస్ సంధూ చెప్పారు. చంకూర్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయని సమాచారం. అల్లర్లకు సంబంధించిన ఓ ఉద్యానవన శాస్త్రవేత్త కీలకంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడుతోంది. హింసను రెచ్చగొట్టేందుకు డబ్బులు కూడ ఇచ్చారని సిట్ అధికారులు గుర్తించారు.

హనీప్రీత్‌ కోసం సాగుతున్న వేట

హనీప్రీత్‌ కోసం సాగుతున్న వేట

గుర్మిత్ సింగ్ దత్త పుత్తిక హనీ కోసం వేట కొనసాగుతోంది. ఆమెను పట్టుకునేందుకు నేపాల్ సరిహద్దులకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపించారు. ఆమె ఎక్కడ ఉందనే దానిపై వేట కొనసాగుతోంది. ఆమె ఎక్కడున్నా ఖచ్చితంగా అరెస్టు చేస్తామని హరియాణా డీజీపీ చెబుతున్నా... వారం రోజులైనా ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు. హనీ కోసం ముంబై, నేపాల్ బోర్డర్‌లో వేట కొనసాగిస్తున్నారు. సరిహద్దు దళాలు, సైన్యం, ఇతర రాష్ట్రాల పోలీసులతో టచ్‌లో ఉన్నామని హరియాణా పోలీసులు తెలిపారు. గుర్మిత్‌ను దోషిగా కోర్టు నిర్ధారించాక ఆయనను పోలీసుల నుంచి తప్పించేందుకు హనీప్రీత్ ప్రయత్నించారనే అభియోగాలు ఉన్నాయి. భారత్, నేపాల్ సరిహద్దుల్లో హనీ కోసం గస్తీ ముమ్మరం చేశారు. ఇందు కోసం ప్రత్యేక బృందాలను పంపించారు. సెప్టెంబర్ 1న హనీప్రీత్ సింగ్‌పై లుక్‌ఔట్ నోటీసు జారీ అయింది. అయితే అంతకు ముందే ఆమె దేశాన్ని వీడి వెళ్లిందని పోలీసులు భావిస్తున్నారు.

English summary
he special investigation team (SIT) probing into the violence case involving key Dera Sacha Sauda members Aditya Insaan, Honeypreet Insaan and Surender Dhiman Insaan, on Wednesday revealed that the dera had pumped at least Rs 5 crore to fuel violence after sect chief Gurmeet Ram Rahim Singh was convicted for rapes in Panchkula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X