Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటర్వ్యూలో దేవయాని షాకింగ్ నిజాలు! బెదిరించారని..

న్యూఢిల్లీ: అమెరికాలో మాజీ డిప్యూటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా దేవయాని ఖోబ్రాగాడే అరెస్టు ఉదంతం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఆమెను అమెరికాలో అరెస్టు చేశారు. అనంతరం కొద్ది రోజులకు భారత్ వచ్చారు. ఈ విషయమై దేవయాని టైమ్స్ నౌకు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె నాటి ఉదంతం గురించి ఎన్నో విషయాలు చెప్పారు.

తనకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉన్నప్పటికీ తన పట్ల బాధాకరంగా ప్రవర్తించారని ఆమె వాపోయారు. డిసెంబర్ 12వ తానుతన పిల్లలను పాఠశాలలో దింపేందుకు వెళ్లానని, తాను పాఠశాల నుండి బయటకు వచ్చానని, అప్పుడు బయట ఓ వ్యక్తి, మరో మహిళను చూశానని చెప్పారు.

తాను బయటకు రావడాన్ని చూసిన వారు తనతో.. తాము బ్యూరో ఆఫ్ డిప్లోమాటిక్ సెక్యూరిటీ నుండి వచ్చామని, అరెస్టు వారెంట్ ఉన్నట్లు చెప్పారని దేవయాని తెలిపారు. తాను పలుమార్లు విజ్ఞప్తి చేశాక వారు తనకు అరెస్టు వారెంట్ చూపించారని, తనకు డిప్లోమాటిక్ ఇమ్యూనిటీ ఉన్నప్పటికీ వారు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు.

Devyani Khobragade reveals unholy truths behind her arrest; Was threatened by maid

తనను అరెస్టు చేసే సమయంలో తాను తన లాయర్‌కు ఓ ఫోన్ కాల్ చేసుకునేందుకు కూడా అనుమతించలేదని, అమెరికా తనకు ఓ లాయర్‌ను ఇస్తుందని చెప్పారని తెలిపారు. తన వాళ్లకు ఫోన్ చేసుకుంటానని నచ్చచెప్పాక వారు ఒక ఫోన్ కాల్‌కు అంగీకరించారని చెప్పారు.

తాను తన అరెస్టు విషయమై తన భర్తకు, తన సిస్టర్ ఇన్ లాకు చెప్పానని, ఆ తర్వాత వారు తన వద్ద నుండి తన ఫోన్‌ను తీసుకున్నారని చెప్పారు. తనను తనిఖీ చేసి విషయమై తాను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. తన ఫింగర్ ప్రింట్స్ తదితరాలు తీసుకున్నారని తెలిపారు. తాను డిప్లోమాటిక్ అయినందున వాటి నుండి తనకు మినహాయింపు ఉన్నదని, కానీ అది పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు.

తాను చట్ట వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదన్నారు. వీసా విషయంలోను ఎలాంటి గందరగోళం లేదన్నారు. అందులో పేర్కొన్న 4,500 డాలర్ల శాలరీ తనదని, తన వంట మనిషిది కాదన్నారు. తాను తన వంట మనిషిని తన కుటుంబ సభ్యురాలిగా చూశానని తెలిపారు. ఆమె ఇలా చేస్తుందని తాను ఊహించలేదన్నారు. తాను ఆమెను పూర్తిగా నమ్మానని ఆవేదన వ్యక్తం చేశారు.

తన వంట మనిషి అదృశ్యమైనప్పుడు తనకు యూఎస్ అథారిటీ నుండి ఎలాంటి సహకారం లభించలేదని చెప్పారు. కొద్ది రోజుల అనంతరం తనకు తన వంట మనిషి లాయర్ నుండి పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. తనను వంట మనిషి కూడా బెదిరించిందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+