Cervical Cancer vaccineపైనే ఇప్పుడు అందరి చర్చ.. ఎందుకంటే!!
బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందడం, 32 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో, పూనమ్ పాండే అభిమానులలో కొత్త చర్చకు కారణంగా మారింది. ఎవరు ఊహించని విధంగా పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ బారినపడి మృతి చెందడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో గర్భాశయ కాన్సర్ రాకుండా తీసుకోవలసిన వ్యాక్సిన్ గురించి చర్చ జరుగుతోంది.
పూనమ్ పాండే మృతి నేపధ్యంలో గర్భాశయ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించవచ్చని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. అమ్మాయిలు ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ ను నివారించడం కోసం 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలు వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Recommended Video

ఇక నిన్న పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ గురించి అవగాహన పెంచుకుంటున్నారు. దేశంలో గర్భాశయ క్యాన్సర్ ను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఈ మేరకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం తొమ్మిది సంవత్సరాల నుంచి 14 ఏళ్లలోపు వయసున్న బాలికలకు వ్యాక్సినేషన్ ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు నిన్న బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
గర్భాశయ క్యాన్సర్ కేసులలో దాదాపు పావు వంతు భారత్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుండి గర్భాశయానికి సంబంధించిన వ్యాక్సినేషన్ పై ప్రజలు చర్చిస్తూ ఉండగా, తాజాగా పూనమ్ పాండే మృతితో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. కచ్చితంగా బాల్య దశలోనే 9 ఏళ్ల నుండి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ టీకాలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications