Marriage: కాసేపట్లో పెళ్లి.. విందు విషయంలో గొడవ.. కట్ చేస్తే సీన్లోకి పోలీసులు

Marriage: ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద నిర్ణయాలు కారణమవుతుంటాయి. ఇలాంటివి పెళ్లిళ్ల విషయంలో ఎక్కువగా జరుగుతుంటాయి. వధువు తరపు వారు మర్యాదలు సరిగ్గా చేయలేదనో, భోజనాల్లో ముక్కలు వేయలేదనో పెళ్లిళ్లు రద్దు చేసుకున్న ఘటనలు ఈ మధ్యకాలంలో వార్తల్లో చాలానే వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. పెళ్లిలో భోజనం కూడా పెట్టడం లేదని అతిథులు చెప్పడంతో వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేయగా.. ఆ జంట సూరత్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన ఫిబ్రవరి 2న సూరత్ లోని వరాచా ప్రాంతంలో జరిగింది.

అసలేం జరిగిందంటే.. సూరత్‌లోని వరాచా ప్రాంతంలోని ఒక వివాహ మండపంలో ప్రమోద్ మహతో, అంజలి అనే జంట పెళ్లికి రెడీ అయింది. వధూవరులు ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చొని ఉన్నారు. చాలా వరకు పెళ్లి ఆచారాలు కూడా పూర్తి అయ్యాయి. ఇంతలోనే పెళ్లిలో భోజనాలు పెట్టడం లేదని అతిథులు వరుడి కుటుంబానికి ఫిర్యాదు చేయగా.. అకస్మాత్తుగా పెళ్లిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. వరుడి కుటుంబం వివాహం కొనసాగించడానికి నిరాకరించగా.. వరుడు ప్రమోద్ మహతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడు.

Dispute Over Wedding Feast Leads to Marriage at Police Station in Surat Gujarat

తనకు అన్యాయం జరుగుతోందని భావించి వధువు అంజలి కుమారి తన కుటుంబంతో కలిసి సహాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. పోలీసులు వరుడి కుటుంబసభ్యులను పిలిపించి పరిస్థితిని చక్కదిద్దారు.చివరికి ఆ జంట పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులే పెళ్లి పెద్దల పాత్రను పోషించారు. ఈ వివాహం ఫిబ్రవరి 3న తెల్లవారుజామున 4:30 గంటలకు జరిగింది. ప్రమోద్, అంజలి పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా పోలీస్ స్టేషన్ నుంచి దండలు మార్చుకుని బయలుదేరిన వీడియోను సూరత్ పోలీసులు షేర్ చేశారు.

పెళ్లిలో చాలా ఆచారాలు పూర్తయ్యాక.. భోజనం లేదని రెండు కుటుంబాల మధ్య వాదన జరిగిందని.. వరుడి తరపు వారు పెళ్లిని రద్దు చేసేందుకు నిర్ణయించుకున్నారని డీసీపీ అలోక్ కుమార్ తెలిపారు. వరుడు పెళ్లికి సిద్ధంగా ఉన్నాడని వధువు చెప్పినప్పటికీ అతని కుటుంబం అంగీకరించలేదని వెల్లడించారు. ఆ రెండు కుటుంబాలు తిరిగి వివాహ మండపానికి తిరిగి వస్తే ఘర్షణ జరిగే ప్రమాదం ఉన్నందున ఆ జంట పోలీస్ స్టేషన్ లో పెళ్లి ఆచారాలనూ పూర్తి చేసేలా అనుమతించామని డీసీపీ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించిన తర్వాత వరుడి కుటుంబం కూడా పెళ్లిని అంగీకరించిందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+