Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Divorce: ఆర్మీలో భర్త, విడాకులు, మాజీ కోడలిని దారుణంగా చంపేసిన మామ, అసలు మ్యాటర్ వేరే !

చెన్నై/ తిరుపత్తూర్: ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. బంధువులు మంచి సంబంధం చూశారని ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులు మురిసిపోయారు. ఆ యువతితో ఆర్మీ ఉద్యోగి వివాహం జరిగిపోయింది. పిల్లలు పుట్టిన తరువాత ఆర్మీ ఉద్యోగి భార్య ఆమె భర్తను, అతని కుటుంబ సభ్యులను లెక్క చెయ్యకుండా ఇష్టం వచ్చినట్లు ఎదురు తిరగడం మొదలుపెట్టింది. ఇదే విషయంలో ఆర్మీ ఉద్యోగి, అతని భార్య మద్య రచ్చరచ్చ జరిగింది. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది. దంపతులు కోర్టులో విడాకులు తీసుకున్న ఆర్మీ ఉద్యోగి భార్య ఆమె తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. భర్తతో విడాకులు తీసుకున్న భార్య అతని మామ ఇంటికి వెళ్లింది. అక్కడ మాటామాటా పెరిగిపోవడంతో కత్తి తీసుకున్న మామ అతని కోడలిని దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది.

 ఆర్మీలో ఉద్యోగం

ఆర్మీలో ఉద్యోగం

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని నాట్రంపల్లి సమీపంలోని జంగాలపురంలో మణి అనే ఆయన నివాసం ఉంటున్నాడు. మణి కుమారుడు శివ (40) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శివకు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. బంధువులు మురుగమ్మాల్ అనే యువతి పెళ్లి సంబంధం చూశారని ఆర్మీ ఉద్యోగి శివ కుటుంబ సభ్యులు మురిసిపోయారు.

 పిల్లలు పుట్టిన తరువాత సీన్ రివర్స్

పిల్లలు పుట్టిన తరువాత సీన్ రివర్స్

శివ ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో సొంతఊరికి చేరుకుని అతని భార్య మురుగమ్మాల్ తో కాపురం చేశాడు. శివ, మురుగమ్మాల్ దంపతులకు మదునిషా (11) అనే కుమార్తె, రోహిత్ (8) అనే కుమారుడు ఉన్నాడు. భార్య మురుగమ్మాల్ తో సంతోషంగా కాపురం చేస్తున్న శివ సెలవులు పూర్తి అయిన తరువాత మళ్లీ ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు.

 కాశ్మీర్ లో ఉన్న భర్త ఫ్యామిలీతో విభేదాలు

కాశ్మీర్ లో ఉన్న భర్త ఫ్యామిలీతో విభేదాలు

శివ ప్రస్తుతం కాశ్మీర్ లో విధుల్లో ఉన్నాడు. పిల్లలు పుట్టిన తరువాత ఆర్మీ ఉద్యోగి శివ భార్య మురుగమ్మాల్ ఆమె భర్తను, అతని కుటుంబ సభ్యులను లెక్క చెయ్యకుండా ఇష్టం వచ్చినట్లు ఎదురు తిరగడం మొదలుపెట్టింది. శివ తండ్రి మణి ఏదైనా చెబితే మామ అని కూడా చూడకుండా మురుగమ్మాల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకోవడం మొదలు పెట్టిందని తెలిసింది.

 భర్తను కూడా లెక్కచెయ్యలేదు

భర్తను కూడా లెక్కచెయ్యలేదు

శివ ఫోన్ చేసి పద్దతి మార్చుకోవాలని మురుగమ్మాల్ కు చెబితే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, చెప్పడానికి నువ్వు ఎవరూ అంటూ మురుగమ్మాల్ ఎదురుతిరిగిదని తెలిసింది. ఇదే విషయంలో ఆర్మీ ఉద్యోగి, అతని భార్య మద్య రచ్చరచ్చ జరిగింది. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది.

 విడాకులు తీసుకున్న దంపతులు

విడాకులు తీసుకున్న దంపతులు

శివ, మురుగమ్మాల్ మద్య గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇకలాభం లేదని ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న శివ, మురుగమ్మాల్ దంపతులు ఎవరిపాటికి వాళ్లు ఉంటున్నారు. మురుగమ్మాల్ ఆమె తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది.

 ఇంటి కోసం వెళ్లి మామతో ఢిష్యూం ఢిష్యూం

ఇంటి కోసం వెళ్లి మామతో ఢిష్యూం ఢిష్యూం

భర్త శివతో విడిపోయిన మురుగమ్మాల్ అతని ఆస్తి మీద కన్ను వేసింది. నేరుగా జంగాలపురం వెళ్లిన మురుగమ్మాల్ అక్కడ మాజీ భర్త శివ సోదరుడితో గొడవ పెట్టుకునింది. తరువాత ఈ ఇల్లు నాదని, నా ఇంట్లో మీరు ఉండటానికి వీలు లేదని మురుగమ్మాల్ ఆమె మాజీ భర్త శివ తండ్రి మణికి చెప్పింది. అక్కడ మామ మణితో మాజీ కోడలు మురుగమ్మాల్ పెద్ద గొడవ పెట్టుకుంది. ఆ సమయంలో ఎంత చెప్పినా కోడలు మాట వినకపోవడంతో మణికి మండిపోయింది.

Recommended Video

    Lakshya Trailer Review | Akhanda Movie Is The Deciding Factor || Oneindia Telugu
     మాజీ కోడలిని దారుణంగా చంపేసిన మామ

    మాజీ కోడలిని దారుణంగా చంపేసిన మామ

    వెంటనే ఇంట్లోకి వెళ్లిన మణి కత్తి తీసుకు వచ్చి మాజీ కోడలు మురుగమ్మాల్ మెడ, గొంతు, తల మీద ఇష్టం వచ్చినట్లు పొవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మాజీ కోడలు మురుగమ్మాల్ ను హత్య చేసిన మణి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. విడాకులు తీసుకున్న తరువాత భర్త శివ ఆస్తి మీద కన్ను వేసిన మురుగమ్మాల్ ఆమె మామ చేతిలోనే హత్యకు గురి కావడం తిరుపత్తూరులో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+