బీజేపీ జై శ్రీరాం, భారతమాతను అంగీకరించం-డీఎంకే ఎంపీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు..!
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాడులో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంత అధికారంలోకి వచ్చిన డీఎంకే.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి తమిళనాడులో ఎలాగైనా ఖాతా తెరవాలని శతవిథాలా ప్రయత్నిస్తోంది. ఈ పోరులో బీజేపీ టార్గెట్ గా డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మధురైలో డీఎంకే నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి ఆండిముత్తు రాజా.. బీజేపీ భావజాలమైన రాముడు, భారత మాతను తమిళనాడు ఎప్పటికీ అంగీకరించబోదన్నారు. రాముడికి శత్రువు ఎవరని ఆయన ప్రశ్నించారు. రాముడు, సీతతో కలిసి అడవికి వెళ్ళాడని తన తమిళ గురువు చెప్పారని, ఆయన ఓ వేటగాడినని అంగీకరించాడని రాజా తెలిపారు. అలాగే సుగ్రీవుడు, విభీషణుడిని సోదరులుగా అంగీకరించాడన్నారు. అక్కడ కులమతాలు లేవన్నారు. తనకు రామాయణం తెలియదని, అలాగే రాముడిని తాను నమ్మబోనన్నారు.

భారత్ ఓ దేశం కాదని ఉపఖండమని డీఎంకే ఎంపీ రాజా తెలిపారు. ఒకే దేశం అంటే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి అని.. కానీ భారతదేశం ఒక దేశం కాదు, ఉపఖండం అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు. ఒక సమాజం గొడ్డు మాంసం తింటుంటే, దానిని గుర్తించాలని కోరారు. మణిపూర్‌లో ఎవరైనా కుక్క మాంసం తింటే, అది వారి సంస్కృతిలో భాగమని, మీ సమస్య ఏమిటి? వారు మిమ్మల్ని తినమని అడిగారా అని బీజేపీని రాజా ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ డీఎంకే లేకపోతే భారత్ ఉండదన్నారు.












Click it and Unblock the Notifications