వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

cji dy chandrachud Moonlighting : నేనూ మూన్ లైటింగ్ చేశా- సీజేఐ చంద్రచూడ్ షాకింగ్..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా మూన్ లైటింగ్ పై చర్చ జరుగుతున్న వేళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ఓ కీలక విషయం వెల్లడించారు. తాను కూడా మూన్ లైటింగ్ చేశానని, ఇప్పటికీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో సుప్రీంకోర్టు సీజేగా ఉంటూ ఆయన ఏ మూన్ లైటింగ్ చేస్తున్నారనే దానిపై చర్చ మొదలైంది.

అసలే భారత్ లో మూన్ లైటింగ్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరో కంపెనీకి రహస్యంగా పనిచేయడాన్ని మూన్ లైటింగ్ గా పిలుస్తున్నారు. ఇదే వివాదంతో విప్రో ఏకంగా 300 మంది ఉద్యోగుల్ని తీసేసింది కూడా. దీనిపై విమర్శలు వచ్చినా విప్రో లెక్క చేయలేదు. విప్రో అధినేత రిషబ్ ప్రేమ్ జీ మూన్ లైటింగ్ ఓ రకంగా తనకు ఉద్యోగం కల్పించిన సంస్ధను మోసంచేయడమేనంటూ చేసిన వ్యాఖ్యలతో దీనిపై ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత పలు కంపెనీలు విప్రో బాట పట్టాయి కూడా. ఇవాళ సీజేఐ చంద్రచూడ్ తానూ మూన్ లైటింగ్ చేశానని చెప్పడంతో కొత్త చర్చ సాగుతోంది.

do you know cji dy chandrachud also moonlighted ? here is what he done..

అయితే సీజేఐ చంద్రచూడ్ మూన్ లైటింగ్ చేసింది ఎవరితోనే తెలుసా మ్యూజిక్ తో. గతంలో తాను న్యాయవాదిగా ఉంటూనే ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా పనిచేయడం ద్వారా మూన్ లైటింగ్ చేసినట్లు ఇవాళ ఓ కార్యక్రమంలో చంద్రచూడ్ వెల్లడించారు. ఇప్పటికీ తాను సంగీతంపై మోజుతో ఖాళీ సమయాల్లో మూన్ లైటింగ్ చేస్తుంటానన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చొరవతో గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తొలి అకడమిక్ సెషన్‌ను ప్రారంభించిన అనంతరం చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
cji dy chandrachud on today reveals that he has been also doing moonlighting with music.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X