వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎఫెక్టా? 'హిందుత్వ'తో మోడీని ఇబ్బంది పెట్టొద్దు: వీహెచ్‌పీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

లుథియానా: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలు, నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ విభాగం అధ్యక్షులు రాఘవ రెడ్డి తప్పు పట్టారు.

అలంటి వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇబ్బందుల్లో పడేయవద్దని ఆయన సూచించారు. చాలా రోజుల తర్వాత హిందూ విశ్వాసాలు, సంస్కృతి వికాసానికి తగిన ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిందన్నారు. ఇలాంటి సమయంలో హిందుత్వవాదులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Don't embarrass PM Modi: VHP to Sangh leaders

అందరు సంయమనం పాటించాలన్నారు. ప్రధాని మోడీని పని చేయనిద్దామని, ఆయనకు సమయం ఇద్దామని సూచించారు. రానున్న రోజుల్లో భారతీయత స్వప్నాన్ని ప్రధాని మోడీ సాకారం చేస్తారని ఆకాంక్షించారు. ఆయనకు భారతీయుల యొక్క సంస్కృతి, విశ్వాసాలు తెలుసునని అన్నారు.

కాగా, ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోర్లా పడ్డ విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గాను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలు గెలుచుకుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ 3 స్థానాలకే పరిమితం అయింది.

English summary
A leader of the Vishwa Hindu Parishad (VHP) on Sunday warned pro-Hindu leaders and groups from making comments that could cause "trouble" for Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X