పాకిస్తాన్ తో గొడవల వేళ.. భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ అత్యాధునిక పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్య నగర్‌లోని కేకే రేంజెస్‌లో టాప్ అటాక్ సామర్థ్యంతో ఈ పరీక్ష పూర్తయింది. అత్యాధునిక థర్డ్ జెన్ ఫైర్ అండ్ ఫర్గెట్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఇది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది.

ఈ మిస్సైల్ లో ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ సీకర్, ఆల్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యాక్చుయేషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, టాండమ్ వార్‌ హెడ్, ప్రొపల్షన్ సిస్టమ్, హై పర్ఫార్మెన్స్ సైటింగ్ సిస్టమ్‌ వంటి అత్యంత కీలకమైన భాగాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని డీఆర్డీఓ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, డెహ్రాడూన్ లోని ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వంటి రక్షణ అనుబంధ ల్యాబొరేటరీలు ఈ మిస్సైల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాయి.

DRDO Achieves Successful Test of Man-Portable Anti-Tank Guided Missile Targeting Moving Targets

ప్రయోగాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మూవింగ్ వార్ ట్యాంక్ మోడల్, థర్మల్ టార్గెట్ సిస్టమ్‌ను రాజస్థాన్ జోధ్‌పూర్ డిఫెన్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ సీకర్ పగలు, రాత్రి యుద్ధ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో అమర్చిన ఇన్ ఫ్రారెడ్ టెక్నాలజీ వల్ల ఉద్దేశించిన లక్ష్యాన్ని గైడ్ చేయగలదు. దీనికి అమర్చే వార్‌ హెడ్ ఆధునిక మెయిన్ వార్ ట్యాంకులను ఒక్క దెబ్బకు ఛిన్నాభిన్నం చేయగలదు.

ఈ క్షిపణిని ట్రైపాడ్ లేదా మిలిటరీ వెహికల్ లాంచర్ నుండి ప్రయోగించవచ్చు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. దీనికి డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ భాగస్వామ్య సంస్తలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, బీడీఎల్, బీఈఎల్, ఇతర అనుబంధ పరిశ్రమలను అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇదొక కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+