డ్రగ్స్ కేసు: ముంబైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం, డ్రగ్స్ సప్లయర్ రెగెల్ మహాకాల్ అరెస్ట్ తో బాలీవుడ్ లో ప్రకంపనలు

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. పలు కోణాల నుండి పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ సరఫరాదారులపై కూడా దృష్టి పెట్టింది . ఫలితంగా బాలీవుడ్ సినీ పరిశ్రమతో లింక్ ఉన్న డ్రగ్స్ సప్లయర్ రెగెల్ మహాకాల్ ను అరెస్ట్ చేసింది. రెగెల్ మహాకాల్ అరెస్ట్ బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతుంది .

ముంబైలోని అంధేరీ వెస్ట్ లో దాడులు .. భారీగా డ్రగ్స్ స్వాధీనం

ముంబైలోని అంధేరీ వెస్ట్ లో దాడులు .. భారీగా డ్రగ్స్ స్వాధీనం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణాన్ని, అలాగే బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాన్ని విచారిస్తున్న అధికారులు , ఈ కేసులో పట్టుబడిన డ్రగ్స్ సరఫరాదారులు వారు వెల్లడించిన సమాచారాన్ని బట్టి ముంబైలో పలుచోట్ల జరిపిన దాడులలో అతిపెద్ద డ్రగ్స్ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో వివిధ ప్రదేశాల్లో దాడులు జరిపిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సభ్యులు, కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఐదు కేజీల హషీష్ , ఓపియాయిడ్లు, ఎండిఎమ్ఎ, స్ట్రీట్ నేమ్ ఎక్స్టసీ .. విలువ సుమారు రూ 2.5 కోట్లు

ఐదు కేజీల హషీష్ , ఓపియాయిడ్లు, ఎండిఎమ్ఎ, స్ట్రీట్ నేమ్ ఎక్స్టసీ .. విలువ సుమారు రూ 2.5 కోట్లు

దాడులలో ఐదు కేజీల హషీష్ తో పాటు , ఓపియాయిడ్లు మరియు ఎండిఎమ్ఎ, స్ట్రీట్ నేమ్ ఎక్స్టసీ ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ 2.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి తప్పించుకు తిరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరాదారు , ఈ వ్యవహారంలో కీలకమైన వ్యక్తి రెగెల్ మహాకాల్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు రెగెల్ మహాకాల్ కు డ్రగ్స్ సరఫరా చేసే ప్రధాన నిందితుడు స్థావరాలపై కూడా దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది .

అనుజ్ కేశ్వాని సమాచారంతో కదిలిన డొంక .. డ్రగ్స్ సప్లయర్ రెగెల్ మహాకాల్ అరెస్ట్

అనుజ్ కేశ్వాని సమాచారంతో కదిలిన డొంక .. డ్రగ్స్ సప్లయర్ రెగెల్ మహాకాల్ అరెస్ట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తికి సంబంధించిన డ్రగ్స్ చాట్ లో అనుజ్ కేశ్వాని డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో అనుజ్ కేశ్వానీని అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సెప్టెంబర్ నెల నుండి రెగెల్ మహాకాల్ కు సంబంధించి డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన సంబంధాలపై నిఘా పెట్టారు. రెగెల్ మహాకాల్ కు సంబంధించిన సమాచారం అతని ద్వారా తెలుసుకున్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముంబై అందేరి వెస్ట్ లో జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్ డంప్ ను స్వాధీనం చేసుకుంది.

రెగెల్ మహాకాల్ కు బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు .. బాలీవుడ్ లో ప్రకంపనలు

రెగెల్ మహాకాల్ కు బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు .. బాలీవుడ్ లో ప్రకంపనలు

రెగెల్ మహాకాల్ ను అరెస్ట్ చేశామని అతడిని కోర్టులో హాజరు పరుస్తామని బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు నాయకత్వం వహిస్తున్న ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అన్నారు.రెగెల్ మహాకాల్ ను అరెస్ట్ చేసిన క్రమంలో ఈ కేసులో మరి కొన్ని కొత్త విషయాలు వెల్లడవుతాయని ఆసక్తి నెలకొంది. రెగెల్ మహాకాల్ చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎన్‌సిబి వర్గాలు ధృవీకరించాయి. అతని అరెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ చైన్ మొత్తాన్ని బయటకు తెస్తుందని , బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+