సిక్కింలో భూకంపం: పరుగులు తీసిన జనం
సోమవారం తెల్లవారుజామున సుమారు 3.12గంటల సమయంలో సిక్కిం రాష్ట్రంలో భూ కంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప ప్రభావం తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది.
గ్యాంగ్టక్: సోమవారం తెల్లవారుజామున సుమారు 3.12గంటల సమయంలో సిక్కిం రాష్ట్రంలో భూ కంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప ప్రభావం తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది.
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో నివాసాల్లోని ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

కాగా, ఈశాన్య రాష్ట్రాలతోపాటు మయన్మార్ దేశంలో ఆదివారం రిక్టారు స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాతి రోజే మరోసారి భూమి కంపిచడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications