పోలింగ్ వివరాలు బయటపెట్టలేమని సుప్రీంకు తేల్చేసిన ఈసీ-మిమ్మల్ని ఎలా నమ్మాలన్న కపిల్ సిబల్ !

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ దశల్లో జరుగుతున్న పోలింగ్ ముగియగానే పోలింగ్ శాతాల్ని బహిరంగపర్చడం లేదంటూ ఈసీపై దాఖలైన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు ఈసీ సమర్పించిన అఫిడవిట్ లో కీలక అంశాల్ని పేర్కొంది. పోలింగ్ శాతాల్ని బూత్ ల వారీగా ప్రజలకు తెలియజేయాల్సిన చట్టపరమైన బాధ్యత తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై స్పందించిన ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ అలా అయితే ఈసీని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

అన్ని పోలింగ్ బూత్ లలో నమోదైన ఓట్ల వివరాలను ప్రజలకు బహిరంగ పేర్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఈసీ తెలిపింది. ఈ వివరాలు పోటీలో ఉన్న అభ్యర్ధులకు, వారి ఏజెంట్లకు తెలిస్తే చాలని పేర్కొంది. ప్రతీ పోలింగ్ బూత్ లో పోలైన ఓట్లను తెలిపే ఫామ్ 17ను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం కుదరదని ఈసీ తేల్చిచెప్పేసింది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉంటాయి కాబట్టి అది అంతిమంగా ఓటర్లలో గందరగోళానికి కారణమవుతుందని తెలిపింది.

ec tells sc no legal mandate to share voter turnout with public sibal ask how do we trust them

ప్రతీ దశ ఎన్నికల తర్వాత ప్రతీ బూత్ లో నమోదైన ఓట్ల వివరాలను 48 గంటల్లోకా ఆన్ లైన్ లో పెట్టేలా ఈసీని ఆదేశించాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు ఈసీ ఈ అఫిడవిట్ సమర్పించింది. ఈసీకి ఇలా ఇవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత కూడా ఉందని తెలిపింది. దీనిపై స్పందిస్తూ అలాంటి చట్టపరమైన బాధ్యత తమకు లేదని ఈసీ వివరణ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+