Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల సంఘం కొరడా-86 రాజకీయ పార్టీల తొలగింపు-మరో 253 ఇనాక్టివ్ గా ప్రకటన..

దేశంలో జమిలి ఎన్నికల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. అంతకు ముందే సంస్కరణలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల ప్రక్షాళనకు నడుం బిగించింది. దీంతో రాజకీయ ఇన్నాళ్లూ ఆడుతూ పాడుతూ పార్టీలు పెట్టి వాటిని నడిపించకుండా, రద్దు చేయకుండా టైంపాస్ రాజకీయాలు చేస్తున్న పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది మే 25 నుంచి మొత్తం 537 కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా లేని రాజకీయపార్టీలపై ఈసీ చర్యలు తీసుకుంది. వీటిలో 86 నమోదైన, గుర్తింపు లేని రాజకీయ పార్టీలను 'ఉనికిలో లేనివి'గా గుర్తించి వాటిని జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అలాగే 253 రాజకీయ పార్టీల్ని క్రియారహితంగా ప్రకటించింది. బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల నివేదికల ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో కూడిన కమిషన్ 253 పార్టీలపై చర్య తీసుకుంది.

Election Commission of india delist 86 political parties and declares 253 inactive

253 పార్టీలు క్రియారహితంగా ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఎందుకంటే వారు వారికి పంపిన లేఖ/నోటీసుకు స్పందించకోవడం, ఒక రాష్ట్ర సాధారణ అసెంబ్లీకి లేదా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడమే కారణమని ఈసీ తెలిపింది. వీటిలో తమిళనాడుకు చెందిన 14 పార్టీలు, ఉత్తరప్రదేశ్ కు చెందిన 34 పార్టీలు, ఢిల్లీకి చెందిన 33 పార్టీలు, తెలంగాణ నుంచి తొమ్మిది, కర్ణాటక నుంచి ఆరుపార్టీలున్నాయి.
రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించబడిన 86 పార్టీలు సంబంధిత సీఈవోల భౌతిక తనిఖీ తర్వాత, బట్వాడా చేయని లేఖలు, నోటీసుల నివేదిక ఆధారంగా ఉనికిలో లేవని తేలినట్లు ఈసీ వెల్లడించింది.

ఇలా క్రియారహితంగా ప్రకటించిన 253 పార్టీలు 2015 నుంచి 16 కంటే ఎక్కువ దశల్లో ఈసీ నిబంధనల్ని పాటించనట్లుగా, డిఫాల్ట్ అయినట్లుగా తేల్చారు. నిష్క్రియంగా ప్రకటించబడిన పార్టీలు ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఆర్డర్, 1968 ప్రకారం ప్రయోజనాలను పొందేందుకు అర్హత కలిగి ఉండవని ఈసీ తెలిపింది. ఇది పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఉమ్మడి గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ఈ 253 పార్టీల్లో 66 పార్టీలు తమ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాయని.. అయితే ఆయా ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈసీ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+