
అంతం లేని ఆర్ట్ వర్క్: ఒక కళాకృతిలోనుండి మరో కళాకృతి.. అద్భుత సృజన; వీడియో వైరల్
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక అద్భుతమైన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచంలో అద్భుతమైన సృజన చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు అన్న విషయం ఈ వైరల్ వీడియోలతో వెలుగులోకి వస్తుంది.
స్కూల్లో విద్యార్థితో మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్; టీచర్ పై సస్పెన్షన్ వేటు!!

ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అద్భుత సృజన... వైరల్ అవుతున్న ఆర్ట్ వర్క్
తాజాగా వాస్కంగే అనే ఫ్రెంచ్ ఆర్టిస్ట్ సృజన చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ ఆద్యంతమూ ఆసక్తికరంగా కనిపిస్తుంది. అంతంలేని ఆర్ట్ వర్క్ తో అద్భుతమైన కళాకృతులు సృష్టించాడు సదరు ఆర్టిస్ట్. ఆర్ట్‌వర్క్‌లో కళాకృతిని సృష్టించిన వాస్కంగే నిర్దిష్ట ప్రదేశాలలో జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ చేస్తూ మరొక కళాకృతిని చూపిస్తున్నాడు. కలల లోపల అంతర్గత కలలు అనే కాన్సెప్ట్‌పై పనిచేసిన క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ మూవీని ఇది నెటిజన్‌లకు గుర్తు చేస్తోంది.

ఒక ఆర్ట్ లో నుండి మరో ఆర్ట్ ... ఇలా ఎన్నో కళాఖండాలు
చిత్రంలోని ఈ చిత్రకళ సోషల్ మీడియాలో ఇంకెంత సేపు అనే భావనను కొందరికి కలిగిస్తుంటే, మరికొందరు ఈ అద్భుతమైన సృజనకు కళాకారుడిని ప్రశంసిస్తున్నారు. కొందరు ఆర్ట్ వర్క్ లోపల ఆర్ట్ వర్క్, దాని లోపల మరో ఆర్ట్... ఇలా పోతూ ఉన్న కళాకృతులను చూసి బాబోయ్ అంటున్నారు.
వాస్కంగే యొక్క ఆర్ట్‌వర్క్ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్ట్ వర్క్ వీడియోలో, ఒక చిత్రం నుండి మరొక చిత్రం, మరొక చిత్రం నుండి ఇంకొక చిత్రం ఇలా కనిపిస్తూ అంతం లేకుండా అనేక చిత్రాలు కనిపిస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎండ్‌లెస్ పేపర్ యాప్‌ని ఉపయోగించి సృష్టించిన ఆర్ట్ వర్క్
ఆర్ట్‌వర్క్ యొక్క వివరాలు ప్రత్యేకంగా నిలిచాయి మరియు ఆయన కాన్సెప్ట్ కూడా అలాగే ప్రత్యేకంగా కనిపించింది. ఆర్ట్‌వర్క్ ఎండ్‌లెస్ పేపర్ యాప్‌ని ఉపయోగించి రూపొందించబడిందని తెలుస్తుంది. ఇది అనంతమైన కాన్వాస్‌ని కలిగి ఉన్న సరికొత్త రకమైన యాప్, ఇది మీరు చేతితో వ్రాసిన నోట్స్, స్కెచ్ రేఖాచిత్రాలను, ఆలోచనలను అన్వేషించడానికి మరియు వాటిని అభివృద్ధి చేయడానికి, మీ బృందంతో ఆలోచనలు చేయడానికి మరియు మీ ఆలోచనలకు రూపం ఇవ్వడానికి పనికొస్తుంది.

వాస్కంగే అంతం కాని అద్భుత కళాఖండాలు బోలెడు
వాస్కంగే యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, ఎండ్‌లెస్ పేపర్‌ని ఉపయోగించి సృష్టించబడిన అనేక వీడియోలను చూడవచ్చు . చిత్రంలో ఒక చిత్రం , మరొక చిత్రానికి తీసుకువెళుతుంది. అతని ఆర్ట్‌వర్క్ సౌజన్యంతో, అతను ఇన్‌స్టాగ్రామ్‌లో 70,000 మంది ఫాలోవర్లను సంపాదించాడు. అతని కళాకృతి నెటిజన్లలో బాగా ప్రాచుర్యం పొందింది. చాలామంది అతని ఈ వినూత్న కాన్సెప్ట్ కు ఫిదా అవుతున్నారు.