షాక్: పీఎఫ్ వడ్డీరేట్లలో కోతకు యోచన, 8.65 కంటే తక్కువ వడ్డీ?
పీఎఫ్ ఖాతాదారులకు షాక్ కల్గించే వార్తే ఇది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి భవిష్యనిధి ఖాతాపై ఇస్తున్న 8.65శాతం వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులకు షాక్ కల్గించే వార్తే ఇది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి భవిష్యనిధి ఖాతాపై ఇస్తున్న 8.65శాతం వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీఎప్ ఖాతాలపై 8.65 వడ్డీని మరింత తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై గతంలో కంటే తక్కువ వడ్డీ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే సమాచారం.
పీఎఫ్ ఖాతాల చందాదారుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

పీఎప్ వడ్డీ రేట్లలో కోత?
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ 4.5కోట్ల మంది సభ్యుల ఆశలపై నీళ్లు చల్లేలా కన్పిస్తోంది.2016-17 ఆర్థిక సంవత్సరానికి భవిష్యనిధి ఖాతాపై ఇస్తున్న 8.65శాతం వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉందని సమాచారం. చందాదారుల ఖాతాల్లో ‘ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్'(ఈటీఎఫ్)లను జమ చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చి చివరి నాటికి చందాదారులందరూ తమ ఖాతాలకు ఎన్ని ఈటీఎఫ్ యూనిట్లు వచ్చాయో చూసుకునే వీలును కూడా కల్పించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న వడ్డీరేటుకు కోత పెట్టే అవకాశం ఉందని సమాచారం.

2017-18లో తక్కవ వడ్డీ రేటు
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్యనిధి చందాదారుల డిపాజిట్‌లపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీరేటు కన్నా తక్కువ ఇచ్చే అవకాశం ఉందిని సమాచారం. బాండ్‌లపై తక్కువ ఆదాయం వస్తున్న దృష్ట్యా ఆ మొత్తాన్ని ఈటీఎఫ్‌లను చందాదారుల ఖాతాల్లో జమచేయనుందని కొందరు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆదాయ వనరుల కోసం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చందాదారులకు ఖాతాలకు వడ్డీరేటును చెల్లించేందుకు ఆదాయ వనరులకు సంబంధించి ఈపీఎఫ్‌వో కసరత్తులు చేస్తోందని అధికారులు తెలిపారు.చందాదారులు తమ సొమ్ము నుంచి అడ్వాన్స్ తీసుకున్నప్పుడు, లేదా తమ ఖాతాను పూర్తిగా పరిష్కరించుకున్నప్పుడు ఈపీఎఫ్‌వో.. వారి ఈటీఎఫ్ యూనిట్లను నగదుగా మారుస్తుంది.

చందాదారులు నేరుగా ట్రేడింగ్ చేయలేరు
ఈ యూనిట్లతో చందాదారులు నేరుగా ట్రేడింగ్ చేయలేరు. వారు దరఖాస్తు చేసినప్పుడు కేంద్రీయ సంస్థే వాటిని నగదుగా మారుస్తుంది.అయితే పీఎఫ్ ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీ కోత విషయమై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటున్నారు అధికారులు. అయితే వడ్డీ రేటులో కోత విధించేందుకు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications