థాయ్‌లాండ్ వెళ్లాలనుకునేవారికి ఎగిరి గంతేసే వార్త.. ఆ ఫ్లైట్స్ ఫ్రీ!

పర్యాటకానికి పెట్టింది పేరైన థాయ్‌లాండ్ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మరో కొత్త ప్రణాళికను రచించింది. థాయ్‌లాండ్ కి వెళ్లాలనుకునే పర్యాటకులు ఎగిరి గంతేసి వార్త చెప్పింది. పర్యాటకులు దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శించిన ప్రోత్సహించడానికి పర్యాటకులకు ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చింది.

థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్
థాయ్‌లాండ్ దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల కోసం ఉచిత దేశీయ విమాన ప్రయాణాన్ని అందించే కొత్త పథకాన్ని థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. థాయ్‌లాండ్ దేశానికి వెళుతున్న చాలామంది దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ పర్యాటకులు పుకెట్, బ్యాంకాక్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

Exciting news for those who want to go to Thailand those flights are free

బై ఇంటర్నేషనల్ ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆఫర్
అయితే ఈ క్రమంలో తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు అక్కడి అన్ని పర్యాటక ప్రాంతాలను చూడడం కోసం థాయ్‌లాండ్ ప్రభుత్వం బై ఇంటర్నేషనల్ ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ అనే ఆఫర్ ను రెడీ చేసింది. ఈ ఆఫర్ తో దేశీయ వన్వే టికెట్ ధర 1750 బాత్ లు, రౌండ్ ట్రిప్ అయితే 3500 బాత్ లు పర్యాటకులు కాకుండా ప్రభుత్వమే భరించాలని థాయ్‌లాండ్ సర్కార్ నిర్ణయించింది.

డిసెంబర్ లోపు ఆఫర్ అందుబాటులోకి
ఈ ఆఫర్ డిసెంబర్ లోపు అవకాశం ఉందని సమాచారం. థాయ్‌లాండ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ద్వారా రెండు లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని, సుమారు 21.80 బిలియన్ బాత్ ల ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఈ కార్యక్రమం కోసం ఆరు దేశీయ విమానయాన సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని పనిచేయనుంది.

ఆఫర్ పొందాలంటే ఇలా చెయ్యండి
కాగా థాయ్‌లాండ్ కు సాధారణ అంతర్జాతీయ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ప్రతి ప్రయాణికుడు గరిష్టంగా రెండు దేశీయ విమాన టికెట్లను పొందవచ్చు. అలాగే 20 కిలోల బ్యాగేజ్ కి కూడా అనుమతి ఇస్తారు. ఆఫర్ పొందాలంటే సాధారణ అంతర్జాతీయ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ఎయిర్ లైన్ వెబ్సైట్లు ,ఫ్లై త్రూ సర్వీసులు, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా పొందే అవకాశం ఉంది. కాబట్టి థాయ్ మసాజ్ చేయించుకోవడానికి థాయ్‌లాండ్ వెళ్లాలనుకునేవారు ఈ ఆఫర్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+