భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్‌బుక్,కేంబ్రిడ్జి అనలిటికా

ఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతేడాది భారత్‌లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక్తిగత సమాచారం దొంగలించడం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఫేస్‌బుక్ నుంచి సమాచారం సేకరించి భారత్‌లోని ఓ రాజకీయ పార్టీకోసం కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ పనిచేస్తోందన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణ సందర్భంగాఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికా సంస్థలను సీబీఐ సమాచారం కోరగా రెండు సంస్థలు స్పందించాయి.

Facebook, Cambridge Analytica responds to CBI over data theft of Indians

భారతీయుల వ్యక్తిగత డేటాను దొంగలించిదని కేంబ్రిడ్జ్ అనలిటికా పై ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేయడంతో ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాల్సిందిగా సీబీఐ ఆ సంస్థలను కోరడంతో అవి స్పందించాయని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా పై విచారణ చేసి సాక్షాధారాలు సంపాదించి ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది సీబీఐ.

ఇక సోషల్ మీడియా నుంచి భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంను దొంగలించడం ప్రైవసీ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. డేటాను చోరీ చేసి వ్యక్తుల అనుమతి తీసుకోకుండా ఓ రాజకీయ పార్టీకి సమాచారంను చేరవేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తద్వారా భారత ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇది విజిల్ బ్లోవర్ క్రిస్టోఫర్ వైలీ బయటపెట్టడంతో ఇది వెలుగు చూసింది. భారత్‌లో ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తృతంగా చేపడుతోందని కూడా క్రిస్టఫర్ బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీకి తెలిపారు.

ఇక కేంబ్రిడ్జి అనలిటికా మాతృసంస్థ ఎస్‌సీఎల్ గ్రూపు ప్రధాన కార్యాలయం ఘజియాబాదులోని ఇందిరాపురంలో ఉందని... ఇక ప్రాంతీయ కార్యాలయాలు హైదరాబాదు, అహ్మదాబాదు, బెంగళూరు, కటక్, గౌహతి, ఇండోర్, కోల్‌కతా, పాట్నా, పూణేలలో ఉన్నాయని విజిల్ బ్లోవర్ క్రిస్టోఫర్ గతేడాది మార్చిలో ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+