89 ఏళ్ల వయస్సులో ఏం పని తాత.. బామ్మకు వేధింపులు, సెక్స్ కోసం..
వయస్సు మీద పడితే కోరికలు తక్కువే.. కానీ అతనికి మాత్రంక కాదు. 89 ఏళల వయస్సులో.. తన భార్యను టార్చర్ చేస్తున్నాడు. సెక్స్ కోసం హరాస్ చేస్తుండగా.. విసిగి వేసారిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్ వడోదరలో జరిగింది. ఆమె 181 అభయం.. మహిళ సమస్యల టోల్ ప్రీ నంబర్‌కు ఫోన్ చేసింది.
సంపన్న కుటుంబం నుంచి అభయం బృందానికి ఫోన్ వచ్చింది. 87 ఏళ్ల మహిళ తన సమస్యను చెప్పసాగింది. తన భర్త సెక్స్ కోసం వేధిస్తున్నాడని వాపోయింది. అతని వయస్సు 89 ఏళ్లు అని తెలిపింది.అతను ఇంజినీర్‌గా పనిచేసి. రిటైరయ్యారు. వీరిద్దరూ వడోదరలో గల సయాజీగంజ్ ఏరియాలో ఉంటారు. తాత మాత్రం బామ్మను ఊపిరి తీసుకొనివ్వడం లేదట.

భార్య భర్తలు కొన్నేళ్లపాటు బానే ఉన్నారు. కుమారుడు, కోడలుతోపాటు ఉన్నారు. ఒకవేళ భార్య సెక్స్ కోరికను తిరస్కరిస్తే.. ఆ రోజు ఇంట్లో రచ్చ రంబోలే..ఆరుస్తాడని.. మండలిస్తాడని అభయంకు బాధిత వృద్దురాలు తెలియజేశారు. తన ఆరోగ్యం బాగోలేదని.. అలసటగా ఉందని చెప్పినా భర్త వినిపించుకోలేదు. దీంతో వారికి ఫోన్ చేయాల్సి వచ్చింది.
ఈ వయస్సులో యోగా చేయాలని నిపుణులు కోరారు. దైవ దర్శనం కోసం వెళ్లాలని సూచించారు. పార్క్, గార్డెన్ విజిట్ చేయాలని కోరారు. అభయం బృందం వచ్చి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అతడిలో మార్పు వచ్చింది.












Click it and Unblock the Notifications