హార్ట్ బ్రేకింగ్ వీడియో.. పైలట్ నమాన్ష్ ను చూసి భార్య, కూతురు ఎమోషనల్

ఇటీవల దుబాయ్ ఎయిర్ షో లో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలిన ఘటనలో పైలట్ నమాన్ష్ సయాల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడి భౌతికకాయం హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. నమాన్ష్ భౌతికకాయం వద్ద అతని భార్య, కూతురుతోపాటు.. నమాన్ష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నమాన్ష్ సయాల్ సతీమణి అఫ్షాన్.. అతని కుమార్తె విలపిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Final Journey Home Tejas Pilot Sumit Namansh Reaches Kangra Family in Tears

నవంబర్ 21న యూఏఈలో జరిగిన దుబాయ్ ఎయిర్ షోలో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలిన ఘటనలో పైలట్ నమాన్ష్ సయాల్ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా స్వదేశం చేరుకున్న అతడి భౌతిక కాయాన్ని సూలూరు ఎయిర్‌ బేస్‌ కు తరలించి అక్కడి వాయుసేన అధికారులు, జవాన్లు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సయాల్ భౌతికకాయానికి పలువురు సైన్యాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక తాజాగా నమాన్ష్ సయాల్ హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా ఎయిర్ పోర్ట్ నుంచి స్వస్థలం పాటియాల్కర్ గ్రామానికి చేరుకుంది. అతడి భౌతిక కాయాన్ని డీసీఎంలో గ్రామంలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. వందలమంది ప్రజలు పాల్గొన్నారు.

ఇక పైలట్ నమాన్ష్ సయాల్ పార్థివదేహాన్ని చూసిన అతడి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారిని ఆపడం ఎవరితరం కాలేదు. నమాన్ష్ సయాల్ సతీమణి అఫ్షాన్, అతని కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించారు. సయాల్ సతీమణి అఫ్షాన్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నమాన్ష్ సయాల్ పార్థివదేహాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అతడి భౌతిక కాయానికి ఒక్కొక్కరుగా నివాళులు అర్పిస్తున్నారు.

ఇక నవంబర్ 21న యూఏఈలో జరిగిన దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమంలో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ విన్యాసాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అధికారికంగా వెల్లడించింది. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ ఎగిసిపడింది. ఈ ఘటన అల్ మక్ టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+