Four states Assembly election 2023 results:డైలీహంట్ పై ఎన్నికల ఫలితాలు,విశ్లేషణ
సుమారు రెండు నెలల పాటు ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ బాగా కనిపించింది. రాజకీయ పార్టీల హడావుడి, ప్రచారం, చర్చలు, ఇలా చాలా అంశాలతో దేశమంతా ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇక ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడుతాయి.
ఇక ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మూడు పెద్ద రాష్ట్రాలుండగా మరో రెండు చిన్న రాష్ట్రాలు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు నవంబర్ 17వ తేదీ ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రధాన పోటీ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగింది. ఈ రాష్ట్రంలో మహిళా ఓటర్ల తీర్పు కీలకం కానుంది. ఇక రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. నవంబర్ 25న పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా పోటీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీల మధ్యే ప్రధానంగా సాగింది.

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇక మూడో సారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా..కాంగ్రెస్ కూడా ఫుల్ జోష్‌తో కనపడుతుంది. ఇక బీజేపీ కూడా కొన్ని చోట్ల గట్టిపోటీ ఇస్తుందనే చెప్పాలి. ఛత్తీస్‌గఢ్‌లో 71 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. తొలిదశ నవంబర్ 7 రెండో దశ నవంబర్ 17న జరిగాయి. ఇక మిజోరాంలో 40 స్థానాలకు నవంబర్ 7వ తేదీన పోలింగ్ జరిగింది.
డైలీహంట్ పై కవరేజ్
నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. మిజోరాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4వ తేదీన జరుగుతుంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు లైవ్‌తో సహా పూర్తి స్థాయిలో డైలీహంట్ కవర్ చేస్తోంది. ఎన్నికలు కేవలం అంకెలతో మాత్రమే ముడిపడి ఉన్నాయనేది డైలీ హంట్ నమ్మదు.పూర్తి స్థాయి డేటా ఆధారంగా విశ్లేషించడం జరుగుతుంది.ఒక్కసారి ఫలితాలు రావడం ప్రారంభమయ్యాక, అన్ని కోణాల్లో సమగ్ర విశ్లేషణ ఇస్తాం. ఫలితాలపై డేటా సేకరించి ఫలితాలు ఎందుకు అలా వచ్చాయో విశ్లేషిస్తాం.లైవ్‌తో పాటు వేగవంతమైన ఎన్నికల అప్‌డేట్స్ చక్కటి టాబ్యులర్ ఫార్మాట్‌లో ఉంటాయి.
ఈ సారి ఫలితాలు గత ఫలితాలతో పోలుస్తూ విశ్లేషణలు
ఆయా నియోజకవర్గాల్లో సీట్ల మార్పులతో ఏ మేరకు ప్రభావం ఉందనేదానిపై అప్‌డేట్స్
సోషల్ మీడియాలో రియాక్షన్స్, ట్రెండ్స్, ట్విటర్ ట్రెండ్స్
లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలు, వీడియోలతో డైలీ హంట్ పై మా ఎన్నికల కవరేజీ ఉంటుంది.
సమగ్ర ఎన్నికల కవరేజ్ సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు డైలీహంట్ ఎన్నికల జోన్‌ను పునరుద్ధరించి కొత్త మార్పులు చేర్పులతో మీ ముందుకు తీసుకొస్తోంది. ప్రాథమిక అంశాలకు మించి కొత్త ప్రమాణాలతో, సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోంది.పార్టీ సమాచారం, అభ్యర్థుల జాబితా,రియల్‌టైమ్ అప్‌డేట్స్‌తో ఎలక్షన్ కార్డ్స్, అభ్యర్థుల సమగ్ర ప్రొఫైల్, నిష్పక్షపాతంతో కూడిన విశ్లేషణలు డైలీహంట్ పై వీక్షించొచ్చు. నాణ్యతతో కూడిన ఎన్నికల వీడియోలు,లైవ్ అప్‌డేట్స్, యూజర్లతో కనెక్ట్ ఎంగేజ్ అయ్యేలా క్విజ్‌లతో పాటు మరిన్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి మీరు ఎలాంటి సమాచారం కోసం వెతుకుతున్నారో అవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్ పై ఉండాలన్న లక్ష్యంతో డైలీహంట్ సరికొత్త ఎలక్షన్ జోన్‌ను ఆవిష్కరించింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications