• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

త్రిపురలో కమల వికాసం నుంచి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు రాజకీయపరిణామాలు

|

2018వ సంవత్సరం ముంగిపు దశకు చేరుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశంలో ఎన్నో పొలిటికల్ డెవలప్‌మెంట్స్ చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా త్రిపురాలో కమలం పార్టీ పాగా వేయడం నుంచి ఈ ఏడాది చివరిలో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలు హస్తగతం అయిన ఘటనలు చూశాం. ఇక రాఫెల్ రచ్చ కూడా 2018 రెండో అర్థభాగంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఈ ఏడాదిలో ఇద్దరు ప్రముఖ రాజకీయనాయకులు మృతి చెందడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ మరొకరు తమిళనాడు దిగ్గజం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి. ఇక ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంటులో రాహుల్ గాంధీ కౌగలించుకోవడం ఇటు జాతీయ మీడియానే కాదు అటు అంతర్జాతీయ మీడియా దృష్టిని సారించింది. అయితే ఈ ఏడాది అంటే 2018లో రాజకీయంగా చోటుచేసుకున్న ప్రధాన ఘట్టాలు మీకోసం ఒక్కసారి అందిస్తున్నాం.

త్రిపురాలో కమలం పార్టీ విజయభేరి

త్రిపురాలో కమలం పార్టీ విజయభేరి

కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న త్రిపురా రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ పాగా వేసింది. అప్పటి వరకు ఉన్న మాణిక్ సర్కార్‌ ప్రభుత్వాన్ని మోడీ-షా ద్వయం కుప్పకూల్చారు. ఆ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కింది.ఇక్కడ మూడింటరెండో వంతు మెజార్టీ బీజేపీకి దక్కింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిప్లబ్ కుమార్ మార్చి 9,2018లో ప్రమాణస్వీకారం చేశారు. త్రిపురా రాజధాని అగర్తలాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు హాజరయ్యారు.

 కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం

కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. దీంతో ఆ రాష్ట్రంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జనతాదల్ సెక్యులర్ పార్టీకి హస్తం అందించి ఆ పార్టీ అధినేత కుమారస్వామిని సీఎం చేసింది. అంతకంటే ముందు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విఫలం అయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేయడం, కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం దేశం నుంచి వివిధ రాజకీయపార్టీల అధినేతలు హాజరయ్యారు. దీంతో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్క తాటిపైకి వచ్చినట్లయ్యింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, సీపీఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మే 23 2018న జరిగింది.

ఇజ్రాయిల్‌తో భారత్ స్నేహగీతం

ఇజ్రాయిల్‌తో భారత్ స్నేహగీతం

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత్‌లో ఆరు రోజుల పాటు పర్యటించారు. ఆ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా నెతన్యాహూతో పాటు వచ్చారు. ఇలా ఆ దేశ ప్రధాని ఒక విదేశీ పర్యటనకు వెళ్లినసమయంలో ఆయనతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గుజరాత్ సబర్మతి ఆశ్రమంను సందర్శించారు. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహూ భార్య సారా నెతన్యాహూ చరఖాను తిప్పింది. దీని ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. ఇది జనవరి 17, 2018న చోటుచేసుకుంది.

ప్రధాని మోడీని నిండు సభలో కౌగలించుకున్న రాహుల్

ప్రధాని మోడీని నిండు సభలో కౌగలించుకున్న రాహుల్

ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని నిండు సభలో కౌగలించుకుని కన్నుగీటాడు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో వాడీ వేడీ చర్చ జరిగింది. తన ప్రసంగాన్ని పూర్తి చేసిన రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని మోడీ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి కౌగలించుకున్నారు. లోక్‌సభ వేదికగా ఈ అద్భుత ఘట్టం జూలై 20, 2018న చోటు చేసుకుంది.

2018లో టాప్ 10 చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే

తమిళనాడు మాజీముఖ్యమంత్రి కలైగ్నర్ కరుణానిధి కన్నుమూత

తమిళనాడు మాజీముఖ్యమంత్రి కలైగ్నర్ కరుణానిధి కన్నుమూత

ద్రవిడ మున్నేట్ర కగజం అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి 7 ఆగష్టు 2018న తుదిశ్వాస విడిచారు. దీంతో దేశ రాజకీయచరిత్రలో ఒక శకం ముగిసింది. దాదాపు 70 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కరుణానిధి ఎప్పుడూ ద్రవిడ రాజకీయాలపైనే మాట్లాడారు. కరుణానిధి మృతితో దేశరాజకీయాల్లో స్పష్టమైన లోటు కనిపించింది. ఆయనను ఎక్కడ ఖననం చేయాలనేదానిపై కాస్త వివాదం నెలకొన్నప్పటికీ కోర్టు జోక్యంతో ఆయన్న మెరీనా బీచ్ దగ్గరే సమాధి చేయడం జరిగింది. దశాబ్దాల పాటు తమిళనాడును శాసించిన రాజకీయ దురంధరుడు. అభిమానులు కలైంగర్ అని పిలుచుకుంటారు. 1969-2011 మధ్య అయిదుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో సంభాషణల రచయితగా ఉన్నారు. తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలు ఎన్నో రాశారు. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.

 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత

అటల్ బిహారీ వాజ్‌పేయి..మూడు సార్లు దేశానికి ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి. తొలిసారిగా 1996లో 13 రోజులపాటు , ఆ తర్వాత 1998 నుంచి 1999 మధ్య 13 నెలలపాటు, అనంతరం పూర్తికాలం అంటే ఐదేళ్లపాటు 1999 నుంచి 2004 వరకు దేశ ప్రధానిగా సేవలందించారు అటల్ బిహారీ వాజ్‌పేయి. భారత దేశానికి పూర్తి కాలం పాటు ప్రధానిగా వ్యవహరించిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి బీజేపీకి చెందిన తొలి వ్యక్తి వాజ్‌పేయి. ఆగష్టు 16,2018న తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు వాజ్‌పేయి. వాజ్‌పేయి అంతిమయాత్రలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇతర నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాఫెల్ జెట్ కొనుగోలులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్

రాఫెల్ జెట్ కొనుగోలులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌ను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో అన్ని విపక్షపార్టీలు పాల్గొన్నాయి. అంతేకాదు ఆ తర్వాత రాహుల్ గాంధీ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్టు చేయాల్సిందిగా కోరారు. అక్కడే ఓ అరగంటపాటు కూర్చున్నారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ బయట తమ నిరసనలు తెలిపారు. అక్టోబర్ 26,2018న జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ రాఫెల్ జెట్ విమానంకు చెందిన కటౌట్‌ను ప్రదర్శించారు.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం తీర్పు

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం తీర్పు

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అప్పటి ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కులు, ప్రార్థన హక్కులను ఆలయ యాజమాన్యం కాలరాస్తోందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నవంబర్ 17,2018న సుప్రీం తీర్పు తర్వాత ఆలయం తొలిసారిగా తెరుచుకుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నించగా అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో గులాబీ గుభాళింపు

తెలంగాణలో గులాబీ గుభాళింపు

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 88 స్థానాలు కైవసం చేసుకున్న కారు పార్టీ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు, తెలంగాణ జనసమితి పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పాటు అయి బరిలో నిలిచాయి. అయితే ప్రజలు ఈ కూటమిని తిరస్కరిస్తూ టీఆర్ఎస్ పార్టీకే రెండో సారి పట్టం కట్టారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు హస్తగతం

రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు హస్తగతం

మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా... రాజస్థాన్ సీఎంగా అశోక్‌గెహ్లాట్ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఛత్తీస్‌గడ్ సీఎంగా భూపేష్ భగల్ బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

English summary
The year 2018 is drawing to a close. The largest democracy in the world has witnessed many political developments starting from BJP's victory in Tripura to comeback of Congress in three states at the end of the year. Also, the contentious Rafale deal has made headlines in latter part of the year. The country bade adieu to veteran politicians like former PM Atal Bihari Vajapayee and former Tamil Nadu CM M Karunanidhi. Also, Rahul Gandhi's hug to PM Narendra Modi in the Parliament caught the eyeballs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X