Foreign lady: విదేశీ అమ్మాయిలు, ఆంటీల హైటెక్ వ్యభిచారం, ఫారిన్ లేడీస్ కు నకిలి ఆధార్ !
బెంగళూరు: హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో దాడులు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. హైటెక్ వేశ్యవాటిక దందా కేంద్రంలో 11 ఆధార్ కార్డులు, నకిలి ఐడీ కార్డులు సీజ్ చేశారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే విదేశాల నుంచి అమ్మాయిలు, ఆంటీలను పిలుచుకుని వచ్చి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న నిందితులు విదేశీ మహిళలకు నకిలి ఆధార్ కార్డులు ఇప్పించడంతో పోలీసులు హడలిపోయారు. తీగలాగితే డొంక కదిలినట్లు విదేశీ మహిళల హైటెక్ వ్యభిచారం గుట్టుతో పాటు నకిలి ఆధార్ కార్డుల స్కామ్ బయటకు రావడం కలకలం రేపింది.

సార్..... ఇక్కడ ఏదో జరుగుతోంది ?
బెంగళూరులోని మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటికి నిత్యం ఇతర ప్రాంతాల నుంచి పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అమ్మాయిలు, ఆంటీలు, అనేక మంది మగాళ్లు వచ్చి వెలుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులకు సమాచారం ఇచ్చారు.

క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో కేక
బెంగళూరు సిటి క్రైమ్ బ్రాంచ్ విభాగం ఏసీపీ ఎం. నాగరాజ్, ఇన్స్ పెక్టర్ అంజుమాల తదితరులు ఆ ఖరీదైన ఇంటి మీద దాడులు చేశారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలతో పాటు ఐదు మందిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, 11 ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ మహిళలతో హైటెక్ వ్యభిచారం
నిందితులు నౌషద్, రియాజుల్ షేక్, సమీర్ అనే ముగ్గురు నిందితులతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన మహిళ, పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మహిళలను బెంగళూరు రప్పించుకుని వారితో బలవంతంగా హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

విదేశీ మహిళలకు ఆధార్ కార్డు.... దేవుడా !
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డులో బాంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చి హైటెక్ వ్యభిచారం చేస్తున్న మహిళ ఆధార్ కార్డు కూడా ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసులకు అనుమానం రాకుండా బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగళూరు వచ్చిన మహిళలకు నకిలి ఆధార్ కార్డులు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ఉగ్రవాదులకు చిక్కితే ?
హైటెక్ వ్యభిచారం, ఆ దిక్కుమాలిన వ్యాపారం సాఫీగా సాగిపోవడానికి విదేశీ మహిళలకు నకిలి ఆధార్ కార్డులు ఇప్పించారని పోలీసుల విచారణలో నిందితులు నౌషద్ ఆలీ, రియాజుల్ షేక్, సమీర్ అంగీకరించారని పోలీసులు అంటున్నారు. హైటెక్ వ్యభిచార కేంద్రంలో ఉన్న విదేశీ మహిళలకే వీళ్లు నకిలి ఆధార్ కార్డులు ఇప్పించారని పోలీసులు అన్నారు., ఇలాంటి నకిలి ఆధార్ కార్డులు ఉగ్రవాదుల చేతికి చిక్కితే ఇంకేమైనా ఉందా ? అంటూ ప్రజలు హడలిపోతున్నారు.

ఇంకా ఎంతమంది ఉన్నారు ?
తీగలాగితే డొంక కదిలినట్లు హైటెక్ వ్యభిచార కేంద్రంపై దాడి చేసిన పోలీసుల చేతికి నకిలి ఆధార్ కార్డుల దందా గుట్టు చిక్కడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. విదేశీ మహిళను బెంగళూరులోని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని, ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications