Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ కు లీక్ .! నోరు విప్పిన జైశంకర్..!

కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ముందుగా పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన భారత్.. ఈ విషయాన్ని వెంటనే ప్రపంచ దేశాలకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ను పూర్తిస్దాయిలో చేపట్టి పాకిస్తాన్ లో దాడులకు దిగింది. అయితే పాకిస్తాన్ కు దీనిపై ముందుగానే సమాచారం ఇచ్చామని గతంలో విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పి ముందుగా తాము ఉగ్రశిబిరాలు మాత్రమే కూల్చామని, ఎయిర్ బేస్ లు కానీ రక్షణ స్థావరాలు కానీ ముట్టుకోలేదని, అమాయక ప్రజలపై దాడులు చేయడం లేదని విదేశాంగమంత్రి జైశంకర్ గతంలో తెలిపారు. దీంతో ఆపరేషన్ సింధూర్ గురించి ముందే తెలుసుకున్న పాకిస్తాన్ భారత్ పంపిన రాఫెల్ జెట్ల సహా పలు యుద్ధ విమానాలు కూల్చేసిందని, వీటి వివరాలు బయటపెట్టాలని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

foreign minister Jaishankar clarified time of information to Pakistan over operation sindoor

రాహుల్ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ కేంద్రం.. ఈ వివరాలు బయటపెడితే లేని పోని తంటా ఎందుకని మౌనంగానే ఉండిపోయింది. అయితే ఇన్ని రోజులకు విదేశాంగమంత్రి జైశంకర్ పార్లమెంటరీ కమిటీ ముందు ఈ వివరాలు బయటపెట్టారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం అయ్యాక అరగంటకు తాను పాకిస్తాన్ కు పోన్ చేసి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన అరగంటలోపు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చామన్నారు.

అయితే ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీ భారత మిలిటరీ ఆపరేషన్స్ డీజీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదించారని, దీనికి భారత్ అంగీకరించడంతో ఇది అమల్లోకి వచ్చిందన్నారు. భారతదేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కచ్చితంగా దాడులు చేసిందని, ఉద్రిక్తతలను నివారించడానికి పాకిస్తాన్‌కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేసినట్లు జైశంకర్ పార్లమెంటరీ కమిటీలోి సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+