యుద్దంతో ప్రతీ ఒక్కరూ లాభపడ్డారు..! ఎలాగో చెప్పిన సుప్రీం మాజీ జడ్జి..!

జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో పాకిస్తాన్ అత్యధిక నష్టాలు చవిచూసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆశ్రయించి కాల్పుల విరమణ ప్రకటించేలా చేసింది. దీనికి బారత్ కూడా అంగీకరించక తప్పలేదు. ఈ విషయంపైనే ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిద్దరితో పాటు హఠాత్తుగా కాల్పుల విరమణ చేయించిన అమెరికా అధ్యక్షుడు, ప్రధాని మోడీ ఈ వ్యవహారంతో లాభ పడ్డారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ట్వీట్ చేశారు.

భారత్-పాక్ మధ్య యుద్దం ఆపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాలూ ఘర్షణపడితే తమ దేశంతో వాణిజ్య పరంగా నష్టపోతారనే హెచ్చరికలు కూడా చేసారు. అంతకు ముందే భారత్ తో యుద్దం జరుగుతుండగానే పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ 7500 కోట్ల మేర సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ యుద్దం మొదలైన తర్వాత నుంచీ ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన అందరూ లబ్ది పొందారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండేయ కట్జూ తెలిపారు.

former supreme court judge markandey katju explains how everyone benefitted with indo-pak war

భారత్ తో యుద్దం మొదలయ్యాక పాకిస్తాన్ కు భారీగా ప్రపంచ బ్యాంక్ రుణం లభించిందని, చైనా తమ యుద్ధ విమానాలు, క్షిపణుల్ని పరీక్షించుకుందని, టర్కీ కూడా తమ డ్రోన్లను పరీక్షించుకుందని మార్కండేయ్ కట్డూ తెలిపారు. అలాగే బీజేపీ రాబోయే బీహార్ సహా ఇతర ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేసుకుందన్నారు. అలాగే ఫ్రాన్స్ రాఫెల్ జెట్లను పరీక్షించుకుందన్నారు. చివరికి పహల్గాంలో దాడికి పాల్పడ్డ తీవ్రవాదులు కూడా 72 గంటల పాటు గాలింపు నుంచి ఊరట పొందారని కట్జూ తెలిపారు. చివరిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ పొందారని, తద్వారా నోబెల్ శాంతి బహుమతికి మార్గం సుగమం చేసుకున్నారని కట్జూ వెల్లడించారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+