ధనుష్కోడి నుంచి శ్రీలంకకు కొత్తగా మరో "రామసేతు": కేంద్రం ప్లాన్.. కానీ!!
అయోధ్య రామ మందిర నిర్మాణం అట్టహాసంగా జరుగుతోంది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత తాజాగా రామసేతు నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. భారత్ శ్రీలంక మధ్య కొత్తగా వంతెనని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ వంతెనను భారత్ లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ ను కలిపేలా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తుంది. అయితే సముద్రం పై 23 కిలోమీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామేశ్వరం నుండి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉన్న విషయం తెలిసిందే . అయితే కొత్త రామసేతు వారధిని నిర్మించాలని సంకల్పిస్తున్న కేంద్రప్రభుత్వం దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది.

ధనుష్కోడి తలైమన్నార్ శ్రీలంక పాల్క్ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల రామసేతును నిర్మించాలని ఆలోచిస్తుంది కేంద్ర సర్కార్. మొత్తం 40వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేయాలని సంకల్పించింది. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి సాధ్యసాధ్యాలపై ఎన్ హెచ్ ఎ ఐ ద్వారా అధ్యయనం చేస్తోంది. ఈ కారణంగా ట్రిం కోమలి, కొలంబో ఓడరేవులను అభివృద్ధి చేయడానికి కూడా సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి భారతదేశంతో పాటు శ్రీలంక కూడా అంగీకారం తెలిపింది.
ఇక ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రిత్వ శాఖ వంతెన సాధ్యాసాధ్యాల పైన కూడా అధ్యయనానికి సంబంధించి నివేదికను తయారు చేయాలని పేర్కొంది, రామసేతు కొత్త వంతెన నిర్మాణం జరిగితే ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఇరు దేశాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సాంకేతికత, పర్యావరణం మరియు ఆర్థికపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంధీ.
రామసేతు సాధ్యాసాధ్యాలపై నివేదికలో అన్ని అంశాలను సమగ్రంగా పేర్కొనాల్సి ఉంది. ఈ అధ్యయనంలో ఏ మాత్రం నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితి ఉన్నా కొత్త రామసేతు నిర్మాణం జరిగి తీరుతుంది. మరి ఈ అధ్యయనంలో ఫలితాలు ఎలా ఉంటాయనేది మాత్రం తెలుసుకోవాలంటే కొంతకాలం పాటు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications