వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు...!

న్యూఢిల్లీ: డీజిల్ ధర మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. దేశ రాజధానిలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్‌ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.

దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ రూ.69.61 వద్దకు చేరింది. లీటర్ పెట్రోల్ ధర కూడా రూ.78.05 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం దేశీయ ముడి చమురు దిగుమతులను భారం చేస్తున్నాయి.

ఇక ముంబైలో రూ. 85.47, కోల్‌కతాలో రూ. 80.98, చెన్నైలో రూ. 81.09గా ఉంది. డీజిల్‌ ధర కూడా మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. నేడు దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 69.61కి చేరింది. ఇక ముంబైలో రూ. 73.90, కోల్‌కతాలో రూ. 72.46, చెన్నైలో రూ. 73.54గా ఉంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో పాటు వెనుజువెలాలో ఆర్థిక సంక్షోభం, ఆఫ్రికా, ఇరాన్‌ దేశాల నుంచి సరఫరా తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, సోమవారం ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం 70.16 వద్ద ముగిసింది. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. డీజిల్ ధర 16 పైసలు ఎగిసి రూ.75.56, పెట్రోల్ ధర 14 పైసలు ఎగబాకి రూ.82.60 వద్ద ఉన్నాయి.

Fuel prices hiked: Diesel rates soar high

ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ.85.33గా పలుకుతున్నది. మే 29న రూ.86.24గా నమోదై ఆల్‌టైమ్ హైని సృష్టించిన విషయం తెలిసిందే. నాడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.78.43గా ఉన్నది. రూపాయి మారకం విలువ రూ.70 మార్కును దాటిన క్రమంలో ఈ నెల 16 నుంచి ఇంధన ధరలు తిరిగి పురోగమన బాట పట్టాయి. గడిచిన పన్నెండు రోజుల్లో డీజిల్ ధర ఢిల్లీలో 74 పైసలు, పెట్రోల్ 77 పైసలు పుంజుకున్నాయి.

English summary
Fuel prices have been increased for the third straight day today (August 28) with the cost diesel touching record levels. The price of petrol in several cities has crossed Rs 80 per litre mark.
Read in English: Diesel rates soar high
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X