Nano Banana: చీరలో పుట్టుమచ్చ బయటపెట్టేసిన నానో బనానా..! షాకైన మహిళ..!

గూగుల్ జెమినీకి చెందిన నానా బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫొటోల్ని వీడియోలుగా, త్రీడీ ఫొటోలుగా మార్చుకుంటున్న యూజర్లకు ఈ క్రమంలో పలు చోట్ల షాకులు తగులుతున్నాయి. తాజాగా ఝలక్ భవ్నానీ అనే ఓ మహిళా ఇన్ ఫ్లూయెన్సర్ తన చీరకట్టులో ఉన్న ఫొటోను నానో బనానా శారీ ట్రెండ్స్ లో షేర్ చేసి మార్చమని అడిగింది.

దీంతో నానో బనానా యాప్ తన చీరలో ఉన్న ఫొటోను కాస్తా అందంగా మార్చి ఇచ్చింది. ఇందులో తాను స్లీవ్ లెస్ గా, ట్రెండీగా కనిపించడంతో ఆ మహిళ సంతోషానికి అవథుల్లేకుండా పోయాయి. దీంతో ఆమె తన తాజా ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా షేర్ చేసేసుకుంది. అయితే అంతలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం ఏఐ ద్వారా మార్చిన తన ఫొటోలో కనిపించిన ఓ దృశ్యమే. అది ఆమె దాచుకున్న పుట్టుమచ్చ.

Gemini s Nano Banana Saree Trend Backfires Leaves Influencer Feeling Creeped Out

వాస్తవానికి సదరు మహిళా ఇన్ ఫ్లూయెన్సర్ నానో బనానా శారీ ట్రెండ్స్ లో అప్ లోడ్ చేసిన ఫొటోలో ఆమె ఎడమచేతిపై ఉన్న ఆ పుట్టుమచ్చ కనిపించడం లేదు. కానీ ఏఐ మార్చి ఇచ్చిన ఫొటోలో మాత్రం పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏఐ తాను షేర్ చేయని తన శరీర భాగాల్ని కూడా రీడ్ చేసినట్లు ఆమెకు అర్ధమైంది. దీంతో ఆమెకు షాక్ తప్పలేదు. తన శరీరంలో అక్కడే పుట్టుమచ్చ ఉందని జెమినీ నానో బనానాకు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ మరో వీడియో చేసి సోషల్ మిడియాలో షేర్ చేసింది.

ఇది చాలా భయానకంగా, చాలా భయంకరంగా ఉందని మహిళ తెలిపింది. ఇది ఎలా జరిగిందో తనకు ఇంకా అర్థం కాలేదని వెల్లడించింది. ఈ విషయం నానో బనానా యూజర్లకు చెప్పాలనిపించి షేర్ చేస్తున్నట్లు మహిళా ఇన్ ఫ్లూయెన్సర్ తెలిపింది. దయచేసి సురక్షితంగా ఉండాలని కోరింది. మీరు సోషల్ మీడియా లేదా ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో ఏం అప్‌లోడ్ చేస్తున్నారో ఓసారి చూసుకోవాలని కోరింది. ఇప్పుడు ఈ వీడియో ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. జీమెయిల్, డ్రైవ్ లో ఉంచిన అన్ని ఫొటోల్ని జెమినీ రీడ్ చేస్తుందని పలువురు యూజర్లు ఆమె వీడియోకు స్పందనగా చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+