వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడిపై కోపంతో ఫేస్‌బుక్‌లో నగ్న ఫొటోలను పెట్టింది

|
Google Oneindia TeluguNews

Girl posts nude pictures of ‘boyfriend’ on Facebook
లక్నో: తన ప్రియుడి తనను పట్టించుకోవడం లేదని కోపం పెంచుకున్న ఓ యువతి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అతని ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా అప్‌లోడ్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో తన ఫొటోను ఇలా చూసుకున్న ఆమె ప్రియుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడు సైబర్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితురాలిని గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. దేవేశ్ శర్మ ఓ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అతనికి తన స్నేహితుల ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆమె సోదరి(23)కి తన కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతికి హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అతనితో యువతికి స్నేహం పెరిగింది. దీంతో నగరాన్ని చూపెట్టాలని, పార్టీలకు తీసుకెళ్లాలని ఆమె దేవేశ్‌ను కోరేది.

తన పాఠశాల చదువు ముగించిన తర్వాత ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి లక్నోకు వచ్చినట్లు ఆమె తనకు చెప్పినట్లు దేవేశ్ తెలిపాడు. ఆగస్టు 3న ఓ పార్టీకి వెళ్లేముందు తనకు రూ. 4,500 హ్యాండ్‌బ్యాగ్, రూ. 9000 విలువైన మినీ స్కర్ట్ కొనివ్వాలని ఆ యువతి తనను అడిగిందని.. అందుకు తాను నిరాకరించానని దేవేశ్ తెలిపాడు. ఆనాటి నుంచి మళ్లీ ఆమెను కలువలేదని చెప్పాడు. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ద్వారానే మాట్లాడుకున్నామని తెలిపాడు.

ఆమె ఖరీదైన కోర్కెలు తీర్చలేక అతడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆగస్టు 4న సుమారు 100 సార్లు అతనికి ఆ యువతి ఫోన్ చేసింది. అంతేగాక తన డిమాండ్లను తీర్చాలని 50 బెదిరింపు సందేశాలు అతనికి పంపించింది. తనకు రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన దగ్గర లేవని దేవేశ్ చెప్పడంతో రూ. 20వేలు డిపాజిట్ చేయాలని ఆమె తన బ్యాంక్ ఖాతా నెంబరు అతడికి ఇచ్చింది. ఈ వివరాలన్నీ పోలీసులకు ఇచ్చినట్లు దేవేశ్ తెలిపాడు.

ఆ తర్వాతి రోజు నుంచి దేవేశ్ ఆమె ఫోన్ కాల్స్‌ను లిప్ట్ చేయడం మానేశాడు. అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఫేస్‌బుక్ నకిలీ ఖాతా ద్వారా పోస్టు చేయడంతో దేవేశ్ తీవ్రంగా కలత చెందాడు. ఫేస్‌బుక్‌లో అతడి ఫోన్ నెంబర్ ఇవ్వడంతోపాటు ఫేస్‌బుక్‌లో అతడ్ని ‘గే'గా చిత్రీకరించింది ఆ యువతి. దీంతో షాక్ గురైన దేవేశ్.. ఆగస్టు 8న సైబర్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితురాలిని గుర్తించారు. అయితే దేవేశ్‌కు ఫోన్ చేసిన నిందిత యువతి క్షమాపణలు కోరింది. దీంతో అతడు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరలేదు. తనలాగే ఇతరులను కూడా ఆ యువతి వేధిస్తుందేమోనని చెప్పిన దేవేశ్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపాడు.

English summary
In a strange turn of events a 20-something girl created a fake Facebook profile of her so-called boyfriend and put up morphed obscene photos of him for extracting revenge from the boy for ignoring her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X