Goa elections: రాహుల్ గాంధీ ఒక టూరిస్ట్ పొలిటీషియన్; గోవాలో రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ఎదురుదాడి
గోవాలో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా గోవాలో రాహుల్ గాంధీ పర్యటన తర్వాత, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మాత్రమే గోవాకు వస్తారని బీజేపీ నేత సీటీ రవి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఒక 'టూరిస్ట్ పొలిటీషియన్' అని మండిపడ్డారు.
Recommended Video

చైనాతో బిజెపి ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదన్న బీజేపీ నేత సీటీ రవి
కాంగ్రెస్‌పై విరుచుకుపడిన బీజేపీ నేత సీటీ రవి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా'పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు . వట్టి మాటలు భారత దేశానికి, ఉద్యోగాలు చైనాకు అంటూ అయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. చైనాతో బిజెపి ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదని, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు అసత్యమని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కలంగుట్‌లో ఎన్నికల ప్రచారంలో కౌంటర్
దేశానికి విధేయంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బీజేపీ నేత సిటీ రవి సూచించారు. గోవా రాష్ట్రంలో రానున్న ఎన్నికల కోసం కలంగుట్‌లో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా రవి ఈ ప్రకటన చేశారు. గోవాలో ఎన్నికల్లో విజయం సాధించేది బీజేపీనేనని తేల్చి చెప్పారు. ప్రజల మద్దతు ఎవరెన్ని చేసినా బీజేపీకే ఉంటుందని పేర్కొన్నారు.

సాంక్విలిమ్ వర్చువల్ ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
గోవాలో పోరు కేవలం బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు పార్టీల మధ్యే ఉందని, మరే ఇతర పార్టీల మధ్యే పోరు లేదని, తమ ఓట్లను వృధా చేసుకోవద్దని రాహుల్ గాంధీ శుక్రవారం నాడు ప్రజలను కోరారు. బిజెపి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నియోజకవర్గం అయిన సంఖలి (సాంక్విలిమ్)లో వర్చువల్ పబ్లిక్ ర్యాలీని ఉద్దేశించి వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కోవిడ్-19 నిర్వహణ, జీవనోపాధి మరియు పర్యాటక రంగాలలో బిజెపి పూర్తిగా విఫలమైందని అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ఓటర్ల సహకారంతో గోవాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రజలు తమ సమస్యలు వినే ప్రభుత్వానికి ఓటు వేయాలని సూచించారు. ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, ఈసారి కొత్త వారికి అవకాశం ఇచ్చామని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేత సీటీ రవి ఎదురు దాడికి దిగారు. ఇదిలా ఉంటే గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications