మహిళలపై కేంద్రం, ప్రధాని మోదీ కేర్ కు ఇదే నిదర్శనం!
దేశవ్యాప్తంగా మహిళలకు దసరా పండుగకు శుభవార్త చెప్పింది కేంద్రం. మహిళల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి 15 రోజుల పాటు స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యానికి మెరుగైన సేవలు అందించనుంది.
మహిళలకు శుభవార్త చెప్పిన కేంద్రం
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతారు. అటువంటి ఆరోగ్యంపైన మహిళలు శ్రద్ధ పెట్టడం లేదని, శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, వారికి మందులను అందించనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ప్రతి జిల్లాలో పది నుంచి 15వరకు మెడికల్ క్యాంపులు నిర్వహించింది.

మహిళలకు హెల్త్ టెస్ట్ లు
బీపీ, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ పరీక్షలతో పాటు, టీబీ పరీక్షలను కూడా నిర్వహించి, రిపోర్టుల ఆధారంగా వారికి ఉచిత వైద్య సేవలను అందించనుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల కోసం వ్యక్తిగత పరిశుభ్రత, ఋతుస్రావం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇదే సమయంలో పోషణమాసాన్ని కూడా నిర్వహించి, మహిళలకు పోషకాహారంపైన పెద్దఎత్తున అవగాహన తీసుకురానుంది.
స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సెప్టెంబర్ 17వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, మెరుగైన ప్రాప్యత, నాణ్యమైన సంరక్షణ మరియు అవగాహనను నిర్ధారించడం ఈ చొరవ లక్ష్యం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

75 వేల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామన్న మంత్రి నడ్డా
దేశవ్యాప్తంగా స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో 75 వేల ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. ఈ శిబిరాలు మహిళలు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మహిళల ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన కుటుంబాల నిర్మాణమే లక్ష్యం
అదనంగా, పోషకాహారం, ఆరోగ్య అవగాహనతో మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోత్సాహాన్ని అందించడానికి అన్ని అంగన్‌వాడీలలో పోషణ్ మాహ్‌ను పాటిస్తామని మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కుటుంబాలు మరియు సాధికారత కలిగిన సమాజాలను నిర్మించడమే ఈ చర్యల లక్ష్యం అని కేంద్రమంత్రి నడ్డా అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ వాటాదారులు ముందుకు వచ్చి ఈ స్వస్త్ నారీ సశక్త్ పరివార్ లో భాగస్వామ్యం తీసుకోవాలని మంత్రి నడ్డా విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications