కుల్‌భూషణ్ జాదవ్ ఘటనపై పార్లమెంట్‌లో రేపు సుష్మా స్వరాజ్ ప్రకటన
న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్ కుటుంబసభ్యుల పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరుపై పార్లమెంట్‌లో పలు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశాయి.అయితే ఈ ఘటనపై ప్రభుత్వం గురువారం నాడు ప్రకటన చేసే అవకాశం ఉంది.
జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ వైఖరి తలదించుకునేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు నరేశ్ అగర్వాల్ తదితరులు ధ్వజమెత్తారు.పాకిస్తాన్ ప్రవర్తనపై పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది.

జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ వైఖరి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. జాధవ్‌ను తిరిగి మనదేశానికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై రేపు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రకటన చేస్తానని వెల్లడించారు.
భారత్ గూఢచారిగా ముద్రపడి 22 నెలలనుంచి పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాధవ్‌ను ఈ నెల 25న ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ కలుసుకున్నారు.ఈ సందర్భంగా పాక్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications