జడ్జి ఇంట మరో విషాదం: కానిస్టేబుల్ కాల్పుల్లో భార్య చనిపోయి పది రోజులు కాకముందే కొడుకు మృతి

గుర్గావ్ : కొద్ది రోజుల క్రితం గుర్గావ్ జడ్జి భార్య కుమారుడిపై కానిస్టేబుల్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల్లో చికిత్స పొందుతూ జడ్జి భార్య కొద్ది రోజుల క్రితమే మృతి చెందారు. మళ్లీ ఆ ఇంట్లో మరో విషాదం నెలకొంది. కుమారుడు కూడా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకెళితే అక్టోబర్ 13న గుర్గావ్ సెషన్స్ జడ్జి కృష్ణ కాంత్ భార్యను, కుమారుడిపై భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న కానిస్టేబుల్ మహిపాల్ సింగ్ ఓ షాపింగ్ మాల్ సమీపంలో కాల్పులు జరిపాడు.

అక్టోబర్ 14న చికిత్స పొందుతూ జడ్జి భార్య మృతి చెందింది.ఇక ఆయన కుమారుడు కూడా తీవ్ర గాయాలతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. భార్య చనిపోయి 10 రోజులు గడవకముందే ఆ ఇంటా కుమారుడి మృతితో విషాదం అలుముకుంది. ఇదిలా ఉంటే మృతి చెందిన కుమారుడి గుండె, లివర్, కిడ్నీలను దానం చేయడం జరిగింది.

Gurgaon additional judges son dies,after being shot at by security guard

కాల్పుల ఘటన జరిగిన వెంటనే కానిస్టేబుల్ మహిపాల్‌సింగ్‌ను అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత జుడీషియల్ కస్టడీకి తరలించారు. సెషన్స్ జడ్జి కృష్ణ కాంత్‌కు భద్రతా సిబ్బందిగా గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. అంతకుముందు చాలా మంది ఉన్నతాధికారులకు సెక్యూరిటీగా పనిచేశాడు మహిపాల్ సింగ్. ఇదిలా ఉంటే మహిపాల్ సింగ్‌ను జడ్జి భార్య రీతూ, కుమారుడు ధ్రువ్ దూషించడం వల్లే సహనం కోల్పోయి వారిపైకి కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+