Viral Video: డాక్టర్‌తో మాట్లాడుతుండగానే పేలిన ఫోన్.. పసిపిల్లలున్న క్లినిక్‌లో హైటెన్షన్!
Viral Video: వైద్య చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించేందుకు వచ్చిన ఓ రోగి చేతిలోని మొబైల్ పోన్ ఒక్కసారిగా పేలిపోయిన దిగ్భ్రాంతికర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది. గ్వాలియర్‌లోని ఓ 'స్కిన్ అండ్ చైల్డ్ క్లినిక్'లో ఈ విస్పోటనం సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో క్లినిక్ ప్రాంగణంలో ఉన్న రోగులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
రెప్పపాటులో మొదలైన విధ్వంసం
ఆదివారం మధ్యాహ్నం క్లినిక్‌లో ఎప్పటిలాగే రోగుల సందడి నెలకొంది. చర్మవ్యాధి, పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ అశుతోష్ శర్మ తమ వద్దకు వచ్చిన రోగులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఓ యువకుడు తన ఆరోగ్య సమస్యను చూపించుకునేందుకు లోపలికి వచ్చాడు. ఆ యువకుడు వైద్యుడితో మాట్లాడుతుండగానే.. తన చేతిలో పట్టుకున్ మొబైల్ ఫోన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వస్తూ భారీ శబ్ధంతో పేలిపోయింది. పేలుడు సంభవించిన తక్షణమే ఫోన్‌కు తీవ్రమైన మంటలు అంటుకున్నాయి.

ప్రాణభయంతో పరుగులు
అది చిన్నారుల క్లినిక్ కావడంతో ఆ సమయంలో వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చిన అనేక మంది నవజాత శిశువులు, చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. ఫోన్ పేలి మంటలు చెలరేగగానే క్లినిక్ అంతటా క్షణాల్లో గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. క్లినిక్‌లో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో రోగులు, వారి బంధువులు అటూ ఇటూ పరుగులు తీశారు.
సిబ్బంది సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం
ఈ అత్యవసర పరిస్థితిలో క్లినిక్ బయట విధుల్లో ఉన్న సిబ్బంది చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మంటలను చూసిన వెంటనే వారు ఆలస్యం చేయకుండా నీటిని చల్లి, మంటలు చుట్టుపక్కల వస్తువులకు వ్యాపించకుండా వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల ఓ పెద్ద విషాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ, ముఖ్యంగా పసిపిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడటంతో క్లినికి యాజమాన్యం, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
సీసీటీవీ దృశ్యాలు వైరల్
మొబైల్ ఫోన్ పేలడం, అనంతరం క్లినిక్‌లో చెలరేగిన గందరగోళానికి సంబంధించిన దృశ్యాలన్నీ క్లినిక్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఆధారంగా సాంకేతిక నిపుణులు వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లలో నాణ్యత లేని బ్యాటరీలు వాడటం, అధిక వేడి, ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం లేదా బ్యాటరీ ఉబ్బినప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి విస్పోటనాలు జరుగుతుంటాయని స్పష్టం చేస్తున్నారు. ఫోన్ విపరీతంగా వేడెక్కినప్పుడు దానిని వెంటనే దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.
🚨 ग्वालियर: डॉक्टर के क्लीनिक में मरीज का मोबाइल अचानक फटा, मची अफरा-तफरी; घटना CCTV में कैद! https://t.co/mwwKLkAhwV
— Lokmanchtoday (@lokmanchtoday) November 2, 2026














Click it and Unblock the Notifications
