రక్షణ శాఖ కోసం కేంద్రం బిగ్ డీల్

దేశ త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు అవసరమైన ఆయుధాలు, సైనిక రవాణా వాహనాలు, అధునాతన డ్రోన్ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ సమావేశం ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది. దీని మొత్తం విలువ రూ. 2.12 లక్షల కోట్లు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపింది.

దీనికి కొనసాగింపుగా మరో భారీ డీల్ ను కుదుర్చుకుంది రక్షణ మంత్రిత్వ శాఖ. దీని విలువ రూ. 53,866.50 కోట్ల రూపాయలు. నావికా దళం కోసం అత్యాధునిక నౌకలను తయారు చేయడానికి ఉద్దేశించిన కాంట్రాక్ట్ ఇది. ఈ మొత్తంతో ఎనిమిది యుద్ధ నౌకలను తయారు చేస్తారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ను రక్షణ మంత్రిత్వ శాఖ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్, గోవా షిప్ యార్డ్ కు అప్పగించింది. ఈ రెండు సంస్థలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Defence Ministry has signed contracts worth Rs 53867 cr for acquisition of eight Next Gen Corvettes

ఇందులో భాగంగా గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్- 5, గోవా షిప్ యార్డ్- 3 యుద్ధ నౌకలను తయారు చేస్తాయి. కాంపిటీటివ్ బిడ్డింగ్ రూపంలో ఈ కాంట్రాక్ట్ ఖరారు కావడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలో యుద్ధనౌకల తయారీలో కూడా పోటీ నెలకొనే స్థాయిలో పరిశ్రమలు గానీ, షిప్ యార్డ్స్ గానీ ఎదిగాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కు ఇది అద్దం పడుతోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే
ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే

రాబోయే పదేళ్ల కాలంలో ఈ యుద్ధనౌకల నిర్మాణం ద్వారా షిప్‌యార్డులలో సుమారు 72 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే షిప్ యార్డ్ అనుబంధ పరిశ్రమలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి సంబంధించి లక్షలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొననారు. 'మేక్ ఇన్ ఇండియా' పరికరాలు, స్వదేశీ సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం వల్ల రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా దీన్ని కీలక అడుగుగా అభివర్ణించారాయన.

ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

నూతనంగా అందుబాటులోకి రానున్న ఈ నెక్స్ట్ జనరేషన్ కార్వెట్‌లు అత్యంత ఆధునిక క్షిపణులు, ఆయుధాలు, అధునాతన సెన్సార్ వ్యవస్థలతో రూపుదిద్దుకోనున్నాయి. గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భం.. ఇలా మూడు విభాగాల్లో శత్రువుల దాడులను సమర్థంగా ఎదుర్కొని పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సముద్ర వాణిజ్య మార్గాల రక్షణతో పాటు తీరప్రాంత భద్రతను పటిష్టం చేయడంలో ఈ యుద్ధనౌకలు కీలకంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+